- Telugu News Photo Gallery Telangana Schools Summer Holidays Likely To Start From April 25, Says Reports
Telangana: తెలంగాణ స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటినుంచంటే.? ఈసారి భారీగానే.!
భానుడి భగభగలకు తెలంగాణ అంతటా ఒంటిపూట బడులు కొనసాగుతున్న విషయం విదితమే. మార్చి 15 నుంచి రాష్ట్రమంతటా ఒంటిపూట బడులు అమలులోకి రాగా.. ఏప్రిల్ 23తో ముగుస్తాయి. మరి ఇంతకీ తెలంగాణ స్కూల్స్‌కి వేసవి సెలవులు ఎప్పుడు ఉంటాయో.. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా..
Updated on: Mar 30, 2024 | 6:02 PM

విద్యా సంవత్సరం ముగింపునకు వచ్చింది. ప్రస్తుతం పరీక్షల కాలం జరుగుతుంది. ఇంటర్, పది తరగతి పరీక్షలు ముగిశాయి. ఇక మిగిలిన తరగతులకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ ఎగ్జామ్ ఫీవర్‌లో చాలామంది విద్యార్ధులు వేసవి సెలవులు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. ఇక వారి కోసం గుడ్ న్యూస్ తీసుకొచ్చాం.

భానుడి భగభగలకు తెలంగాణ అంతటా ఒంటిపూట బడులు కొనసాగుతున్న విషయం విదితమే. మార్చి 15 నుంచి రాష్ట్రమంతటా ఒంటిపూట బడులు అమలులోకి రాగా.. ఏప్రిల్ 23తో ముగుస్తాయి.

మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు తెలంగాణ స్కూల్స్‌కి ఒంటిపూట బడులు ఉంటాయి. ఇక ఏప్రిల్ 24న స్కూళ్లకు చివరి వర్కింగ్ డే. ఒకవైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు ఏప్రిల్ నెలాఖరు నుంచి పార్లమెంట్ ఎన్నికలు మొదలుకానున్నాయి.

దీంతో పార్లమెంట్ ఎన్నికలు మొదలు అయ్యేలోపే.. విద్యార్ధులకు పరీక్షలు ముగింపజేసి.. వేసవి సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 10 లేదా 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నట్టు తెలుస్తోంది.

ఈ పరంగా చూస్తే మొత్తంగా తెలంగాణ స్కూల్స్‌కి 45 రోజులు వేసవి సెలవులు ఉండనున్నాయి. ఒకవేళ ఎండల తీవ్రత ఎక్కువైతే.. ఈ సెలవులు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.
