Telangana Formation Day: మొదటిసారిగా హైడ్రా పోలీస్ స్టేషన్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు…

చెరువులు, నాలాలు, ప్ర‌భుత్వ‌, ప్ర‌జా ఆస్తుల‌ను ప‌రిర‌క్షించ‌డంతో పాటు.. ప్ర‌కృతి వైప‌రీత్యాలలో ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌కుండా ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండేలా ప‌ని చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం దిశానిర్దేశం చేసింది. ఆ దిశ‌గా అంద‌రూ క‌ల‌సి ప‌ని చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సూచించారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో ఎంతో మంది ప్రాణాలు అర్పించారు.. రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాల‌ని రాష్ట్ర గీతం చాటి చెబుతోంది..

Telangana Formation Day: మొదటిసారిగా హైడ్రా పోలీస్ స్టేషన్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు...
Hydra Police Station

Edited By:

Updated on: Jun 02, 2025 | 2:21 PM

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు, ల‌క్ష్యాల‌కు అనుగుణంగా మ‌న అంద‌రం క‌ల‌సి ప‌ని చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కోరారు. ఎన్నో క‌ల‌లు గ‌ని ప్ర‌త్యేక రాష్ట్రం సాధించుకున్నాం. ఆ క‌ల‌లు సాకారం అయ్యేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కంక‌ణ‌బ‌ద్ధులు కావాల‌ని విజ్ఞప్తి చేశారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ముందు జ‌రిగిన తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వంలో ఏవీ రంగ‌నాథ్‌ మాట్లాడారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఔటర్ రింగు రోడ్డు వ‌ర‌కూ ప‌రిధిని నిర్దేశించి హైడ్రాను రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. చెరువులు, నాలాలు, ప్ర‌భుత్వ‌, ప్ర‌జా ఆస్తుల‌ను ప‌రిర‌క్షించ‌డంతో పాటు.. ప్ర‌కృతి వైప‌రీత్యాలలో ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌కుండా ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండేలా ప‌ని చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం దిశానిర్దేశం చేసింది. ఆ దిశ‌గా అంద‌రూ క‌ల‌సి ప‌ని చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సూచించారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో ఎంతో మంది ప్రాణాలు అర్పించారు.. రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాల‌ని రాష్ట్ర గీతం చాటి చెబుతోంది.. ఆ ల‌క్ష్యాలు నెర‌వేరేందుకు అంద‌రూ క‌ల‌సిక‌ట్టుగా కృషి చేయాల‌న్నారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..