హైదరాబాద్, సెప్టెంబర్ 7: మరికొన్ని రోజుల్లో చనిపోతాననుకున్న ఓ వ్యక్తికి ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు పునరుజ్జీవనం పోశారు. బ్రెయిన్ డెడ్ అయిన ఓ పేషంట్ కాలేయాన్ని ఉస్మానియా వైద్యులు మరో వ్యక్తికి అమర్చి ఆపరేషన్ ని సక్సెస్ చేశారు. కాలేయం మార్పిడి చేసి ఉస్మానియా వైద్యులు ప్రాణం పోశారు. ఈ కాలంలో ఆర్గాన్ ట్రాన్స్పెంటేషన్ అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. కానీ ఉచితంగానే రూపాయి ఖర్చులేకుండా కాలేయం మార్పిడి చేశారు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు.
సిద్దిపేట జిల్లా చేర్యాల కి చెందిన మురళి రెండేళ్ల క్రితం నుంచి కాలయ వ్యాధితో బాధపడుతున్నారు. ఎన్ని ప్రైవేట్ ఆస్పత్రులు వెళ్లిన కాలయ మార్పిడి తప్పదని సూచించారు. దాదాపుగా 30 లక్షల రూపాయలు ఖర్చవుతుందని ప్రైవేట్ ఆస్పత్రులు వైద్యులు తెలిపారు. చివరి ప్రయత్నం గా ఉస్మానియా ఆసుపత్రికి సంప్రదించగా కొన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత ఉస్మానియా వైద్యులు వేరే వ్యక్తి కాలయ మార్పిడి చేస్తే తప్ప మురళి బ్రతికే అవకాశం లేదని వైద్యులు తెలిపారు.
అదే సమయంలో ప్రమాదంలో గాయపడి బ్రెయిన్డెడ్ అయినటువంటి మరో పేషెంట్ గాంధీలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న జీవన్ దాన్ సభ్యులు చనిపోయిన కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదానానికి ఒప్పించారు. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి కాలేయాన్నితొలగించారు. అనంతరం విజయవంతంగా ఉస్మానియా ఆసుపత్రిలో కాలేయ వ్యాధితో బాధపడుతున్న మురళికి అమర్చారు. ఆపరేషన్ తర్వాత కాలేయం పనితీరు సక్రమంగా ఉండటంతో ఆపరేషన్ సక్సెస్ అయిందని ఉస్మానియా వైద్యులు తెలిపారు. దాదాపుగా 48 గంటల పాటు కష్టపడి సర్జరీ విజయవంతం చేసిన డాక్టర్లు మధుసూదన్, పాండు నాయక్ , మాధవి, పావని, సుదర్శన్ , అమర్దీప్ ను సూపర్డెంట్ నాగేందర్ అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చెరువులు, నాలాలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇదే మాదిరి మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రేపు, ఎల్లుండు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 8 రాష్ట్రంలో చాలా చోట్ల, సెప్టెంబర్ 9 కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.