Hyderabad: ‘ఏమండీ.. పక్కింటి వాళ్లు తిట్టారు..’ పిల్లల గొడవ చిలికి చిలికి గాలీవాన .. చివరికి భార్య ఆత్మహత్య

పిల్లల గొడవ చిలికి చిలికి గాలీవాన అయ్యింది. దీంతో పిల్లల గొడవ కాస్తా పెద్దల వరకూ వెళ్లింది. ఈ విషయమై పక్కింటి వాళ్లతో గొడవ పడిందో భార్య. ఐతే పక్కింటి వాళ్లు తిడుతున్నారని భర్తకు చెప్పినా.. అతను పట్టించుకోలేదన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్‌ ఘటన..

Hyderabad: ఏమండీ.. పక్కింటి వాళ్లు తిట్టారు.. పిల్లల గొడవ చిలికి చిలికి గాలీవాన .. చివరికి భార్య ఆత్మహత్య
Hyderabad

Edited By: Ravi Kiran

Updated on: Jun 07, 2023 | 12:39 PM

పటాన్‌చెరు: పిల్లల గొడవ చిలికి చిలికి గాలీవాన అయ్యింది. దీంతో పిల్లల గొడవ కాస్తా పెద్దల వరకూ వెళ్లింది. ఈ విషయమై పక్కింటి వాళ్లతో గొడవ పడిందో భార్య. ఐతే పక్కింటి వాళ్లు తిడుతున్నారని భర్తకు చెప్పినా.. అతను పట్టించుకోలేదన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్‌ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఎస్సై దుర్గయ్య తెల్పిన వివరాల ప్రకారం..

పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన గణేష్‌, శిరీష (25) నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి మూడున్నరేళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం సాయంత్రం శిరీష కూతురు పల్లవి, పక్కింటి పిల్లలతో ఆడుకుంటున్న క్రమంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో పక్కింటి వాళ్లు శిరీషను తిట్టారు. ఈ విషయం భర్త గణేష్‌కు శిరీష ఫోన్‌ చేసి చెప్పింది. గణేష్‌ విధులు ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చాడు. దీంతో భర్త ఇంటికి వచ్చిన వెంటనే తనను తిట్టిన పక్కింటివారిని అడుగుతావా? లేదా అంటూ శిరీష తన భర్త గణేష్‌తో గొడవపడింది. ఐతే అతను ఆ విషయాన్ని దాటవేశాడు.

దీంతో మనస్తాపం చెందిన శిరీష.. ఎవరు తిట్టినా పట్టించుకోవంటూ జూన్‌ 5వ తేదీ రాత్రి తమ ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న మృతురాలి తల్లీదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు శిరీష మృతిపై అనుమానం ఉందని, శిరీష మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.