36 గంటల దీక్షకు సిద్ధమైన తెలంగాణ కాంగ్రెస్
తెలంగాణలో కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయడంపై ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీరుకు నిరసనగా సేవ్ డెమొక్రసీ పేరుతో 36గంటల దీక్షకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం 11గంటలకు ఇందిరా పార్కు దగ్గర ధర్మా చౌక్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దీక్షలో కూర్చోనున్నారు. ఆయనకు మద్ధతుగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఆర్‌సీ కుంతియా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, […]
తెలంగాణలో కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయడంపై ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీరుకు నిరసనగా సేవ్ డెమొక్రసీ పేరుతో 36గంటల దీక్షకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం 11గంటలకు ఇందిరా పార్కు దగ్గర ధర్మా చౌక్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దీక్షలో కూర్చోనున్నారు. ఆయనకు మద్ధతుగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఆర్‌సీ కుంతియా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ దీక్షకు టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితితో పాటు ప్రజా సంఘాలకు చెందిన నేతలు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.