Telangana: కదంతొక్కిన వీఆర్ఏలు.. అసెంబ్లీ వద్ద టెన్షన్.. టెన్షన్.. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు..
తెలంగాణ అసెంబ్లీ వద్ద హై-టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వీఆర్ఏలు, టీచర్లు ఒక్కసారిగా..
తెలంగాణ అసెంబ్లీ వద్ద హై-టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వీఆర్ఏలు, టీచర్లు ఒక్కసారిగా అసెంబ్లీని ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది మంది ఆందోళనకారులు ఒక్కసారిగా అసెంబ్లీ వైపుకు దూసుకొచ్చారు. ‘We Want Justice’, ‘పేస్కేల్ అమలు చేయాలని’, ‘సీఎం మాట నిలబెట్టుకోవాలని’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు వారిని ఇందిరాపార్క్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, వీఆర్ఏలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వారిపై లాఠీఛార్జీ చేయడమే కాకుండా.. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేసి.. గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, ఆందోళనకారులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం.. ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.