Rangam Bhavishyavani: ‘నావన్నీ కాజేస్తున్నారు.. ఆగ్రహంతోనే భారీవర్షాలు’.. భవిష్యవాణి ప్రధానాంశాలు ఇవే

లష్కర్ బోనాల జాతరలో రెండో రోజైన సోమవారం ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి భక్తురాలైన స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

Rangam Bhavishyavani: 'నావన్నీ కాజేస్తున్నారు.. ఆగ్రహంతోనే భారీవర్షాలు'..  భవిష్యవాణి ప్రధానాంశాలు ఇవే
Bonalu 2022
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 18, 2022 | 8:41 PM

Ujjaini Mahankali Bonalu: జంట నగరాలలో బోనాల పండగ వైభంగా జరుగుతుంది. భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. సికింద్రాబాద్‌(secunderabad)లోని ఉజ్జయిని మహాకాళి బోనాల్లో భాగంగా ‘రంగం’ కార్యక్రమం నిర్వహించారు. జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.  పూజా విధానంపై భవిష్యవాణిలో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘‘నా రూపాన్ని మీ ఇష్టం వచ్చినట్లు మారుస్తారా..? ఎన్ని రూపాల్లో నన్ను మారుస్తారు? మీకు నచ్చినట్టు మారుస్తారా? స్థిరమైన రూపంలో నేను కొలువుదీరాలని అనుకుంటున్నా. నా రూపాన్ని స్థిరంగా నిలపండి. భక్తులు నన్ను కనులారా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయండి. గర్భాలయంలో మొక్కుబడిగా వద్దు.. శాస్త్రబద్ధంగా పూజలు చేయండి. నా గుడిలో పూజలు సరిగా జరిపించడం లేదు. ఏదో మొక్కుబడిగానే పూజలు చేస్తున్నారు.   ఎంత సంతోషంగా పూజలు చేస్తున్నారో మీ గుండెపై చేయి పెట్టి చెప్పండి.  మీరు చేస్తున్న పూజలు.. మీ సంతోషానికే తప్ప నాకోసం కాదు. మీరు పెద్దగా చేసేది లేదు. అంతా నేను తెచ్చుకున్నదే. దొంగలు దోచినట్లు నాదే కాజేస్తున్నారు. మీరు చేసే తప్పుల విషయంలో నా ఆగ్రహాన్ని వర్షాల రూపంలో చూపించాను’’  అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి