విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.! పూర్తి వివరాలు..

|

Apr 19, 2024 | 11:45 AM

పరీక్షల కాలం చివరికి వచ్చేసింది. స్కూల్స్‌కి ఆఖరి రోజు కూడా దగ్గరపడింది. దీంతో విద్యార్ధులందరూ కూడా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకో తెలుసా.? సమ్మర్ హాలిడేస్ ప్రకటిస్తారు కాబట్టి.. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా తెలుగు రాష్ట్రాలలోని స్కూల్స్‌కు..

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.! పూర్తి వివరాలు..
Schools Holidays
Follow us on

పరీక్షల కాలం చివరికి వచ్చేసింది. స్కూల్స్‌కి ఆఖరి రోజు కూడా దగ్గరపడింది. దీంతో విద్యార్ధులందరూ కూడా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకో తెలుసా.? సమ్మర్ హాలిడేస్ ప్రకటిస్తారు కాబట్టి.. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా తెలుగు రాష్ట్రాలలోని స్కూల్స్‌కు నెలకు పైగా వేసవి సెలవులు ఉండనున్నాయి. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ఈ సెలవులను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

రోజురోజుకూ పెరుగుతోన్న ఉష్ణోగ్రతల నేపధ్యంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు ప్రారంభం కాగా.. ఏప్రిల్ 23తో ఇవి ముగియనున్నాయి. ఇక ఇదే రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌కి లాస్ట్ వర్కింగ్ డే.. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నట్టు విద్యాశాఖ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం. జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తిరిగి రీ-ఓపెన్ కానున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. సమ్మర్ హాలిడేస్ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే జూన్ 13 వరకు ఈ వేసవి సెలవులు కొనసాగుతాయని సమాచారం. అంటే దాదాపుగా 50 రోజులు ఈసారి ఏపీలోని స్కూల్స్‌కి వేసవి సెలవులు ఉండనున్నాయన్న మాట.