Water War: ఇవాళ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉపసంఘాల సమావేశం.. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చ
గోదావరి, కృష్ణా యాజమాన్య బోర్డుల సబ్ కమిటీ ఇవాళ సమావేశం జరగనుంది. ముందుగా 11 గంటలకు జీఆర్‌ఎంబీ..ఒంటి గంటకు కేఆర్‌ఎంబీ సమావేశం జరగనుంది.
గోదావరి, కృష్ణా యాజమాన్య బోర్డుల సబ్ కమిటీ ఇవాళ సమావేశం జరగనుంది. ముందుగా 11 గంటలకు జీఆర్‌ఎంబీ..ఒంటి గంటకు కేఆర్‌ఎంబీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌పై చర్చించనున్నారు. గతంలో జరిగిన బోర్డుల సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సమన్వయ కమిటీ స్థానంలో ఉప సంఘాలు ఏర్పాటయ్యాయి. ఈ ఉప సంఘాల మొదటి సమావేశం శుక్రవారం హైదరాబాద్ జలసౌధలో జరుగనుంది. ఉదయం 11 గంటలకు గోదావరి బోర్డు ఉపసంఘం, మధ్యాహ్నం ఒంటి గంటకు కృష్ణా బోర్డు ఉపసంఘం సమావేశమవుతాయి.
గోదావరి ఉప సంఘానికి బోర్డు సభ్యకార్యదర్శి, కృష్ణా ఉప సంఘానికి బోర్డు సభ్యుడు కన్వీనర్‌గా ఉన్నారు. బోర్డు సభ్యులు, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు, జెన్కో అధికారులు ఉపసంఘంలో సభ్యులు. గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ, రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన సమాచారం, వివరాలు, సంబంధిత అంశాలపై భేటీలో చర్చిస్తారు.
కృష్ణా, గోదావరి బోర్డులకు చీఫ్ఇంజినీర్లను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. ఒక్కో బోర్డుకు ఇద్దరు ఇంజినీర్లు నియామించింది. కేఆర్‌ఎంబీకి టీకే శివరాజన్, అనుపమ్ ప్రసాద్, జీఆర్‌ఎంబీకి ఎంకే సిన్హా, జీకే అగర్వాల్‌ను నియమించింది. అక్టోబర్ 14 నుంచి కృష్ణా, గోదావరి బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి: IIT Admission 2021: ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులు కూడా IIT లో అడ్మిషన్ తీసుకోవచ్చు.. పూర్తి వివరాలు ఇవిగో..