Rahul Gandhi: రాహుల్‌ ఇక్కడకు వచ్చేయండి.. బిర్యానీ తింటూ మాట్లాడుకుందాం.. అసలు మ్యాటర్ ఏంటంటే..

రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు.. ఇందులో భాగంగా హైదరాబాద్ మియాపూర్ లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ క్రమంలో ఆయనకు విద్యార్థులు బావర్చీ హోటల్ కు రావాలంటూ ఆహ్వానం పంపారు.. బీర్యానీ తింటూ మాట్లాడుకుందాం అంటూ.. ఆయన కోసం ఓ సీటును కూడా ఏర్పాటు చేశారు..

Rahul Gandhi: రాహుల్‌ ఇక్కడకు వచ్చేయండి.. బిర్యానీ తింటూ మాట్లాడుకుందాం.. అసలు మ్యాటర్ ఏంటంటే..
Rahul Gandhi
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 05, 2024 | 4:31 PM

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాదులో కొన్ని గంటలు ఆయన గడపనున్నారు. మియాపూర్ లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో బావర్చీ హోటల్ వద్దకు రండి.. బిర్యానీ తిందామంటూ కొంతమంది విద్యార్థులు.. రాహుల్ గాంధీను ఆహ్వానిస్తున్నారు. బావర్చీ బిర్యానీ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు.. మరోవైపు రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు హైదరాబాద్ పర్యటనల్లో ఆయన పారడైజ్ బిర్యానీ తిన్నారు. కానీ ఇప్పుడు ఈ విద్యార్థులు పిలుస్తున్న ఆహ్వానం వేరేది.. గత ఏడాది ఇదే సమయంలో ఎన్నికలకు ముందు హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ అశోక్ నగర్ లో ఉన్న నిరుద్యోగులను కలుసుకున్నారు. అక్కడ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఆయనే చాయ్ తాగించారు. విద్యార్థులతో అశోక్ నగర్ లో భేటీ అయిన రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ హామీ ఇచ్చారు.

వీడియో చూడండి..

ఈ క్రమంలోనే.. అదే అశోక్ నగర్ కి ఆనుకుని ఉన్న బావర్చీ బిర్యానీ హోటల్ లో బిర్యానీ తింటూ ఉద్యోగాల సంగతి మాట్లాడుకుందాం.. అంటూ ఇప్పుడు అక్కడి స్టూడెంట్ సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు బావర్చీ దగ్గర వెయిట్ చేస్తున్నామంటూ ఒక కుర్చీకి రాహుల్ గాంధీ ఫోటోను తగిలించి.. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. సాయంత్రం రాహుల్ గాంధీ రాక సందర్భంగా చాలామంది విద్యార్థులు బావర్చీ దగ్గర వెయిట్ చేస్తామంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే