Hyderabad: గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ వేదికగా జాతీయస్థాయి సదస్సు

India Game Developers Conference 2024: ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024ను హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నవంబర్ 13-15 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహించనున్నారు.

Hyderabad: గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ వేదికగా జాతీయస్థాయి సదస్సు
India Game Developers Conference 2024
Follow us
Janardhan Veluru

|

Updated on: Nov 05, 2024 | 4:22 PM

హైదరాబాద్, నవంబర్ 05, 2024: హైదరాబాద్‌లోని గేమింగ్ ప్రియులకు తీపికబురు. ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (ఐడీజీసీ) తన 16వ వార్షిక ఎడిషన్‌తో తిరిగి వస్తోంది. దక్షిణాసియాలో అతిపెద్ద, పురాతనమైన ఈ సదస్సు నవంబర్ 13 నుంచి 15 వరకు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనుంది. 5000 మంది ఆహ్వానితులు, 250 మంది పైచిలుకు వక్తలు ఇందులో పాల్గొంటారు. దాదాపు 150 సెషన్లలో జరిగే ఈ సదస్సు గేమింగ్‌ సెక్టార్‌‌లో లోతైన విషయాలను తెలియజేయనుంది. గేమింగ్‌ ఇండస్ట్రీలో దిగ్గజం జోర్డాన్ వీస్‌మాన్ వంటి ప్రముఖులు ముఖ్య వక్తలుగా ఖాయమైన నేపథ్యంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఈవెంట్‌కు ఇది మరింత ఆకర్షణను జోడిస్తోంది. ఆర్‌‌పీజీ ఇండస్ట్రీలోని దీర్ఘకాల ఫ్రాంచైజీలైన బాటిల్‌టెక్, మెచ్‌వారియర్ , షాడోరన్ సృష్టికర్తగా జోర్డాన్ పేరు గడించారు.

ఈ సంవత్సరం ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ) గతంలో కంటే భారీగా ఉంటుంది. ఇది తాజా గేమ్‌లు , సాంకేతికతను ప్రదర్శించే 100కి పైగా బూత్‌లను కలిగి ఉంటుంది. ఈ సమావేశంలో అవార్డ్స్‌ నైట్‌, ఇండీ ఇనిషియేటివ్, పాలసీ రౌండ్ టేబుల్‌లు, వర్క్‌షాప్‌ కూడా ఉంటాయి.

ఐజీడీసీ తన ప్రత్యేకమైన “ఇన్వెస్టర్-పబ్లిషర్ కనెక్ట్” సెషన్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ సంవత్సరం 100 మంది పెట్టుబడిదారులు, ప్రచురణకర్తలు ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం ఉన్న ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఫండింగ్ లేదా పబ్లిషింగ్ భాగస్వామ్యాలను కోరుకునే గేమ్ స్టూడియోలు, డెవలపర్ల మధ్య ఒప్పందాలను సులభతరం చేయడం దీని లక్ష్యం. గత సంవత్సరం ఈ సదస్సు 70 కంటే ఎక్కువ డెవలపర్లు, పెట్టుబడిదారులతో 1,800 సమావేశాలను నిర్వహించింది.

ఈ సంవత్సరం ఐడీజీసీ అవార్డుల్లో కొత్తగా ప్రవేశపెడుతున్న ‘ఇంటర్నేషనల్ గేమ్ అవార్డ్’తో ఇవి మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాయి. దీనితో పాటు ఎప్పట్లానే పది రెగ్యులర్‌‌ అవార్డు కేటగిరీలు, రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులు ఉన్నాయి. అక్టోబర్ 28న నామినీలను ప్రకటించారు. వీరంతా నవంబర్ 14న హైదరాబాద్‌లో జరగనున్న గ్రాండ్ అవార్డుల వేడుకను చూడవచ్చు.

జీడీఏఐ అధ్యక్షుడు శ్రీ శ్రీధర్ ముప్పిడి స్పందిస్తూ “442 మిలియన్ల మంది గేమర్లు, 30 శాతం వార్షిక వృద్ధి రేటుతో భారత్ వేగంగా గ్లోబల్ గేమింగ్ పవర్‌హౌస్‌గా మారుతోంది. దేశంలోని యువత, విస్తృతమైన స్మార్ట్‌ఫోన్ వినియోగం , అభివృద్ధి చెందుతున్న డిజిటల్ పర్యావరణ వ్యవస్థ దీనిని ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ మార్కెట్‌లలో ఒకటిగా మార్చాయి. ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ ( ఐడీజీసీ) భారత్‌లో అభివృద్ధి చెందుతున్న గేమింగ్ పరిశ్రమకు సరైన వేదికగా పనిచేస్తుంది. ఇది భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ ఇండస్ట్రీ భవిష్యత్తును రూపొందించడానికి, సహకరించడానికి, ఆలోచనలను పంచుకోవడానికి, రూపొందించడానికి పరిశ్రమ నాయకులు, డెవలపర్లతో పాటు ఆవిష్కర్తలను ఒకచోట చేర్చుతుంది’ అని అన్నారు.