Hyderabad: అయ్యో దేవుడా.. చూస్తేనే గుండె తరుక్కుపోతుంది.. రెండేళ్ల బాలుడిపై కుక్కల దాడి..
హైదరాబాద్‌లోని అల్లాపూర్‌లో వీధి కుక్కల దాడిలో రెండున్నరేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుక్కలు బాలుడిని లాక్కెళ్లి దాడి చేయడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. కుక్కల దాడితో చిన్నారి విలవిలలాడిపోయాడు.. కాలనీవాసులు వీధి కుక్కల బెడదనుండి రక్షించాలని కోరుతున్నారు.
పిల్లల్ని ఒంటరిగా వదలాలంటే భయం వేస్తోంది.. వీధిలోనే.. ఇంటి ముందే ఆడుకుంటున్నా క్షణక్షణం కనిపెట్టుకుని ఉండకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం.. హైదరాబాద్ నగరంలో వీధికుక్కల స్వైర విహారం అంతలా కనిపిస్తోంది. తాజాగా కుక్కల దాడిలో ఓ చిన్న పిల్లాడు తీవ్రంగా గాయపడ్డాడు.. బోరబండ సమీపంలోని అల్లాపూర్‌లో ఓ బాలుడిపై విచురుకుపడిన కుక్కలు దారుణంగా, కండ ఊడేలా పీకేశాయి.. బాలుడి కేకలు విని కుటుంబసభ్యులు స్థానికులు అక్కడికి వచ్చేలోపే తీవ్రంగా కరిచేశాయి.. తీవ్ర గాయాలపాలైన బాబుని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కుక్కలు బాలుడిపై దాడి చేసిన ఈ ఘటన అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రానా ప్రతాప్ నగర్‌లో చోటుచేసుకుంది.. శనివారం వీధిలో ఆడుకుంటూ ఇంట్లోకి వెళుతున్న రెండున్నర సంవత్సరాల బాలుడు నవాజ్ ఖాన్ పై నాలుగు కుక్కలు ఒకసారి దాడి చేశాయి.. ఇంట్లోకి వెళుతుండగా.. లాక్కెళ్ళి మరి దాడిచేశాయి. దీంతో చిన్నారి విలవిలలాడిపోయాడు.. కేకలు విని.. ఇంట్లో ఉన్న బాబు తల్లి వికలాంగురాలైన వాజిదా బేగం బయటికి వచ్చి ఒక్కసారిగా కేకలు వేసింది.. దీంతో కాలనీ వాసులు వచ్చి కుక్కలను తరిమి బాబును ఆసుపత్రికి తరలించారు.
వీడియో చూడండి..
నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం డాక్టర్లు బాబుని ఇంటికి పంపించారు. కొంచెం లేట్ అయితే బాబు ప్రాణాలు గాలిలో కలిసిపోయేయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. బాబుని కుక్కలు లాక్కేళ్లే వీడియో సిసి కెమెరాలో రికార్డ్ అయింది.. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని.. కుక్కలు బెడద కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు.
కాగా.. ఈ ఘటనపై టీవీ9 వార్తను ప్రసారం చేసింది.. దీనిపై స్పందించిన జిహెచ్ఎంసి అధికారులు.. కుక్కలు పట్టేందుకు హుటాహుటిన కాలనీకి సిబ్బందిని పంపించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..