సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ విగ్రహావిష్కరణకు రావాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను ఆహ్వానించారు త్రిదండి చినజీయర్ స్వామి. ఢిల్లీలో రాష్ట్రపతికి స్వయంగా చినజీయర్ స్వామి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. శంషాబాద్ ముచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమంలో అతిపెద్ద సమతా మూర్తి విగ్రహం ఏర్పాటు కాబోతోంది. 200 ఎకరాల్లో వెయ్యికోట్ల ఖర్చుతో 216 అడుగుల రామానుజ పంచలోహ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు.
స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా రావాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించారు త్రిదండి చినజీయర్ స్వామి. ఇదే వేదికపై శ్రీనివాస రామానుజం, మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావు రాష్ట్రపతిని కలిశారు. విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగ క్రతువు నిర్వహించనున్నారు. యాగంలో 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు. అటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కూడా కలిసిన చిన్నజీయర్ స్వామి, మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావు విగ్రహ ఆవిష్కరణకు రావాలని కోరారు.
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్
కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్