AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saidabad Rape Case: సైదాబాద్ చిన్నారి కేసులో కొనసాగుతున్న ఉత్కంఠ.. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న రాక్షసుడు ఎక్కడ..?

గంటలు గడిచిపోయాయి.. రోజులు దాటుతున్నాయి.. కానీ చిన్నారిపై చిదిమేసిన కిరాతకుడి జాడలేదు.. అమాయకపు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడి ఆచూకీ మాత్రం కనిపించడం లేదు.

Saidabad Rape Case: సైదాబాద్ చిన్నారి కేసులో కొనసాగుతున్న ఉత్కంఠ.. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న రాక్షసుడు ఎక్కడ..?
Saidabad Rapist Raju
Balaraju Goud
|

Updated on: Sep 14, 2021 | 6:01 PM

Share

Saidabad Child Rape Case: గంటలు గడిచిపోయాయి.. రోజులు దాటుతున్నాయి.. కానీ చిన్నారిపై చిదిమేసిన కిరాతకుడి జాడలేదు.. అమాయకపు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడి ఆచూకీ మాత్రం కనిపించడం లేదు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న రాక్షసుడి జాడ మిస్టరీగా మారింది. మరోవైపు హైదరాబాద్ పోలీసు కమీషనర్ నేతృత్వంలో సమావేశమైన ఉన్నతాధికారులు నిందితుడి జాడ కోసం సమీక్ష నిర్వహిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడు ఇంకా దొరక్కపోవడం ఉత్కంఠకు దారితీస్తుంది. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని ఎన్‌కౌంటర్ చేయాలంటూ అనేక మంది డిమాండ్ చేస్తున్నా.. పోలీసులకు మాత్రం అత్యాచార నిందితుడు చుక్కలు చూపిస్తున్నాడు.

హైదరాబాద్ మహా నగరంలో ఆరేళ్ల చిన్నారి పాశవికంగా లైంగిక దాడికి పాల్పడి ఆమె మరణానికి గల కారణాలపై ఇంకా అనుమానాలు కొనసాగుతున్నాయి. అఘాయిత్యానికి పాల్పడింది పల్లంకొండ రాజు మాత్రమే అయినా.. అతడిని తప్పించేందుకు బస్తీవాసి ఒకరు సహకరించారని తెలుస్తోంది. ఆ వ్యక్తే రాజును తప్పించాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు, కొద్ది గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నామంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేసినప్పటికీ.. పోలీసులు మాత్రం రాజు ఆచూకీ ఇంకా లభించలేదని, పది బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నామంటున్నారు. ఈ కేసులో కొనసాగుతున్న ఉత్కంఠపై హైదరాబాద్ పోలీసులు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ పోలీసు కమీషనర్ నేతృత్వంలో సమావేశమైన అధికారులు నిందితుడి నేర చరిత్ర, పారిపోవడానికి గల కారణాలపై సమీక్షించారు.

ఇక.. చిన్నారి కోసం పోలీసులు, తల్లిదండ్రులు, స్థానికులు అన్నిచోట్లా గాలిస్తున్నప్పుడు రాజు స్నేహితుడు అతడిని పక్కకు తీసుకెళ్లి.. ఇక్కడి నుంచి పారిపోవాలంటూ చెప్పినట్లు తెలిసింది. అక్కడున్నవారు వెంటనే గుర్తుపట్టకుండా ఉండేందుకు టోపీ, మాస్కు, తువ్వాలు, ఒక జత దుస్తులతో కూడిన సంచిని ఇచ్చాడంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరి ఆరోపణలకు బలం చేకూర్చుతూ అక్కడున్న సీసీ కెమెరాలో రాజు, అతడి స్నేహితుడు వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. మరోవైపు, నిందితుడు రాజు గంజాయి పీల్చడంతో పాటు గుడుంబా ఎక్కువగా తాగుతుంటాడని, ఎక్కడపడితే అక్కడ పడిపోతాడని పోలీసులు చెబుతున్నారు. అతడి వద్ద ఫోన్‌ లేకపోవడంతో ఎక్కడున్నాడో తెలుసుకోవడం కష్టంగా మారిందంటున్నారు. ఇక నిందితుడు పారిపోయోందుకు సహకరించిన స్నేహితుడిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

సింగరేణి కాలనీలో బాధిత చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు హీరో మంచు మనోజ్. చిన్నారిపై జరిగింది క్రూరమైన సంఘటన అన్నారాయన. సమాజంలో ఆడవాళ్లు, పిల్లల్ని ఎలా గౌరవించాలో ప్రతి ఇంట్లో నిరంతరం నేర్పించాలన్నారు. నిందితుడు ఎక్కడున్నాడో తెలియకపోడాన్ని తప్పుబట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, ఆరేళ్ల చిన్నారిని హత్య చేసిన నిందితుడు రాజుని ఎన్ కౌంటర్ చేస్తామని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు. కాగా, సైదాబాద్‌ సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన ఆరేళ్ల బాలిక కుటుంబాన్ని నిన్న కాంగ్రెస్‌, మజ్లిస్‌, బీఎస్పీ నేతలు పరామర్శించిన సంగతి తెలిసిందే.

Read Also…  Reliance Jewels: బెల్లా కలెక్షన్ ఆవిష్కరించిన రిలయన్స్ జ్యువెల్స్.. కళ్లు మిరుమిట్లు గొలిపే ప్రత్యేక డిజైన్లు..

Boat Accident: పాపం.. దైవ దర్శనానికి వెళ్ళారు.. పడవ మునిగి గల్లంతయ్యారు.. ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి