Star Air: స్టార్ ఎయిర్ కంపెనీ ఇప్పుడు హైదరాబాద్, బెంగుళూర్ మధ్య విమాన ప్రయాణాన్ని ప్రారంభించింది. 26 ఆగస్టు 2021న తన ఎంబ్రాయర్ జెట్‌ను ప్రారంభించింది. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం ఈ విమానాలను నిర్వహిస్తారు. మొదటిసారిగా స్టార్ ఎయిర్ తన 50-సీటర్ ఎంబ్రేర్ జెట్‌తో పరిశ్రమలోని ప్రధాన కంపెనీలతో పోటీపడుతుంది. ఈ సందర్భంగా స్టార్ ఎయిర్ ఛైర్మన్ సంజయ్ ఘోడావత్ మాట్లాడుతూ.. ఎంబ్రేర్ జెట్‌లో 31 సీట్ పిచ్, మిడిల్ సీట్లు లేకుండా అదనపు లెగ్‌రూమ్‌ను అందించడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. హైదరాబాద్, బెంగుళూరు మధ్య కొత్త మార్గాన్ని ప్రారంభించడం మాకు కలిసివస్తుందని అనుకుంటున్నాం. ఈ సర్వీసును ప్రారంభించడం వల్ల మేము గర్వంగా ఫీలవుతున్నాం. ఇది హైదరాబాద్‌లోని ప్రయాణికులకు చాలా ప్రత్యేకమైనదని తెలిపారు.
స్టార్ ఎయిర్ 2021 ఆగస్టు 26 నుంచి జామ్‌నగర్ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌కు నేరుగా విమానాలను నడుపుతోంది. స్టార్ ఎయిర్ కంపెనీ అనేది ప్రముఖ భారతీయ వ్యాపార సంస్థ సంజయ్ ఘోదవత్ గ్రూప్ ఏవియేషన్ విభాగం. ఇది విమానయానం, వినియోగదారుల ఉత్పత్తులు, విద్య, శక్తి, రియల్టీ, రిటైల్, టెక్స్‌టైల్స్ వంటి వివిధ వ్యాపారాలను కలిగి ఉన్నది. స్టార్ ఎయిర్ పాన్-ఇండియా స్థాయిలో (చార్టర్) విమాన సేవలను అందిస్తుంది. ప్రయాణీకులకు గొప్ప సౌకర్యాన్ని భద్రతను కల్పిస్తుంది. ప్రయాణీకులకు అత్యంత సరసమైన ధరలో ప్రపంచ స్థాయి విమాన సేవలను అందించి ‘రియల్ ఇండియాకు కనెక్ట్’ చేయడం దీని ప్రయత్నం.