Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీ క్షేమం కోరుతూ పాతబస్తీలో ప్రత్యేక ప్రార్థనలు.. వీడియో

|

Feb 04, 2022 | 1:37 PM

Attack on Asaduddin Owaisi: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం చేసి ఢిల్లీ వెళ్తున్న హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీ (Asaduddin Owaisi) కాన్వాయ్‌పై గురువారం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీ క్షేమం కోరుతూ పాతబస్తీలో ప్రత్యేక ప్రార్థనలు.. వీడియో
Old City
Follow us on

Attack on Asaduddin Owaisi: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం చేసి ఢిల్లీ వెళ్తున్న హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీ (Asaduddin Owaisi) కాన్వాయ్‌పై గురువారం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కాల్పుల్లో అసదుద్దీన్‌ ఒవైసీ ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. అయితే.. ఒవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ కారు పేలింది. మీరట్‌ (Meerut) లో ప్రచారం అనంతరం అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీకి తిరిగి వస్తుండగా.. ఛాజర్సీ టోల్‌గేట్‌ వద్ద నిందితులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్లు అసదుద్దీన్ మీడియాకు తెలిపారు. ప్రచారం అనంతరం ఢిల్లీ వస్తుండగా కాల్పలు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ విషయంపై లోక్‌సభ స్పీకర్‌ను కూడా కలుస్తానని.. ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఈ రోజు లోక్‌సభలో సైతం దీనిపై ప్రస్తావిస్తానని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

అసదుద్దీన్‌పై కాల్పుల ఘటనపై హైదరాబాద్ పాత బస్తీ ముస్లింలు ఆందోళనకు గురయ్యారు. ఓవైసీకి ఎలాంటి హాని జరగకూడదని.. పాతబస్తీ వాసులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహిళలు కూడా ఈ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కాగా.. అసదుద్దీన్‌పై కాల్పులు ఘటనతో హైదరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఓల్డ్ సిటీలో పోలీస్ బందోబస్తు పెంచారు. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతం పూర్తిగా పోలీస్ వలయంలోకి వెళ్లింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించి గస్తీని పెంచారు.

అసదుద్దీన్‌ ఒవైసీపై దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాల్పుల ఘటన తర్వాత ఆయన భద్రతపై సమీక్షించిన కేంద్ర హోం శాఖ.. అసదుద్దీన్‌కు జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించింది. తక్షణమే సెక్యూరిటీ భద్రత అమల్లోకి వచ్చేలా కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఘటన అనంతరం ముస్లిం సంఘాలు, పలు రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తంచేశాయి. అసదుద్దీన్ దాడికి నిససనగా.. శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి అధికారులకు మెమోరాండం ఇవ్వాలని ఎంఐఎం పార్టీ సైతం కార్యకర్తలకు పిలుపునిచ్చింది.

Also Read:

Asaduddin Owaisi: కాల్పుల ఘటనతో అసదుద్దీన్‌కు జెడ్ కేటగిరీ.. వెంటనే రంగంలోకి NSG కమాండోలు

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీపై దాడి కేసులో ఇద్దరు షూటర్ల అరెస్ట్.. నిందితులు ఏం చెప్పారంటే..?