సామాన్యులకు దక్షిణ మధ్య రైల్వే షాక్ ఇచ్చింది. రైల్వే స్టేషన్లలోని ప్లాట్ ఫాం టికెట్ ధరలను భారీగా పెంచింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో రైల్వే స్టేషన్ లలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో పాటు వారి బంధువులు కూడా పెద్ద సంఖ్యలో స్టేషన్లకు వస్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈక్రమంలో రద్దీని తగ్గించే ప్రయత్నంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరలను భారీగా పెంచింది. తాజా నిర్ణయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం టికెట్ ధర రూ. 50 అయింది. గతంలో ప్లాట్ ఫాం టికెట్ ధర కేవలం రూ. 10 మాత్రమే ఉండేది.
కేవలం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాకుండా నాంపల్లి, కాచిగూడ, వరంగల్, ఖమ్మం, లింగంపల్లి, కాజీపేట్, మహబూబ్‌నగర్, రామగుండం, మంచిర్యాల, భద్రాచలం, వికారాబాద్, తాండూర్, బీదర్, బేగంపేట తదితర స్టేషన్ల ప్లాట్‌ఫాం టికెట్ల ధరలను రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచారు. కాగా సంక్రాంతి పండగ వల్ల రైల్వేస్టేషనల్లో పెరిగిన రద్దీని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. పెంచిన ప్లాట్ ఫాం ధరలు నేటి నుంచే అమలులో ఉంటాయని తెలిపారు. ఈ నెల 20 వరకు ఈ ధరలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.
Temporary Increase in Platform Ticket Rate during #Sankranti Festival Season w.ef 8th January to 20th January, 2022 as detailed:@drmsecunderabad @drmhyb pic.twitter.com/9RWEUpXWFS
— South Central Railway (@SCRailwayIndia) January 9, 2022
Also Read:
Coronavirus: బండ్లగణేశ్‌ను వదలనంటోన్న కరోనా.. మూడోసారి మహమ్మారి బారిన పడినట్లు ట్వీట్..
Coronavirus: సుప్రీంకోర్టును తాకిన కరోనా.. ఏకంగా 150 మంది పాజిటివ్..
RRR: ఇంకా క్రేజ్ తగ్గని ‘నాటు నాటు’.. బ్లాక్ అండ్ వైట్ సినిమాకు ఎలా రీమిక్స్ చేశారో చూడండి..