Summer Special Trains: వేసవి సెలవులు వస్తే సహజంగానే ప్రయాణాలు పెరుగుతాయి. దీంతో రైల్వే ప్రయాణికులు టికెట్ల కోసం ఎగబడుతుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే సమ్మర్ హాలీడేస్‌ను దృష్టిలో పెట్టుకొని మొత్తం 104 ప్రత్యేక రైళ్లను నడపనున్నాయి. వారానికి ఒక సర్వీస్, వారానికి మూడు సర్వీసులను ప్రత్యేకంగా నడపనుంది. ఈ విషయమై తాజాగా రైల్వే శాఖ ఓ ప్రకటనను జారీ చేసింది. వేసవి సెలవుల్లో విహార యాత్రలు, సొంతుళ్లకు వెళ్లే వారి సంఖ్య భారీ ఉండే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ – ఎర్నకులం, మచిలీపట్నం – కర్నూలు సిటీకి ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. సమ్మర్ స్పెషల్ ట్రైయిన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..
* ట్రైయిన్ నెం 07189, సికింద్రాబాద్ నుంచి ఎర్నకులంకు ఏప్రిల్ 1,08, 15, 22, 29 తేదీల్లో, మే నెలలో 06, 13, 20, 27 తేదీల్లో, జూన్ నెలలో 3, 10, 17, 24 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. రాత్రి 09.05 గంటలకు బయలు దేరనున్న రైలు, తర్వాతి రోజు రాత్రి 08.15 నిమిషాలకు ఎర్నకులం చేరుకుంటుంది.
* ట్రైయిన్ నెం 07190, ఎర్నకులం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ప్రత్యేక రైళ్లను ఏప్రిల్ 02, 09, 16, 23, 30 తేదీలు, మే నెలలో 07, 14, 21, 28 తేదీల్లో, జూన్ నెలలో 04, 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
* ట్రైయిన్ నెంబర్ 07067, మచిలీపట్నం-కర్నూలు సిటీకి ఏప్రిల్ నెలలో 02, 05, 07, 09, 12, 14, 16, 19, 21, 23, 26, 28 , 30 తేదీల్లో, మే నెలలో 03, 05, 07, 10, 12, 14, 17, 19, 21, 24, 26, 28, 31 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపున్నారు. జూన్ నెల విషయానికొస్తే 02, 04 ,07 ,09 ,11, 14 ,16, 18, 21, 23 ,25, 28, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. (ప్రతీ మంగళవారం, గురువారం, శనివారం)
* ట్రైయిన్ నెంబర్ 07068 కర్నూలు సిటీ – మచిలీపట్నంకు ఏప్రిల్ 03, 06, 08, 10, 13, 15, 17, 20, 22, 24, 27, 29 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడపున్నారు. మే నెల విషయానికొస్తే 01, 04 ,06, 08, 11, 13, 15, 18, 20, 22, 25, 27, 29 తేదీల్లో. ఇక జూన్ నెలలో 01, 03, 05, 08, 10, 12, 15, 17, 19, 22, 24, 26, 29 తేదీలతో పాటు జూల్ 01న ప్రత్యేక రైళ్లను నడించనున్నారు. (ప్రతీ ఆదివారం, బుధవారం, శుక్రవారం)
ఈ ప్రత్యేక రైళ్లు ఎప్పుడు బయలు దేరే సమయం, గమ్యానికి చేరుకునే సమయానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
104 Weekly and Tri Weekly Special Trains between various destinations @drmsecunderabad @drmhyb @VijayawadaSCR pic.twitter.com/8l86sr2wOy
— South Central Railway (@SCRailwayIndia) March 19, 2022
Also Read: War Effect: దాణా లేక మూగరోదన.. పశువులకు తిండిపెట్టలేక ఏం చేస్తున్నారో తెలుసా
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. రేపు ఆర్జిత సేవల బుకింగ్