Hyderabad: పిల్లలతో కలిసి భార్య సరుకులు తెచ్చేందుకు వెళ్లింది.. తిరిగొచ్చేసరికి భర్త ఇలా చేశాడు

|

Feb 23, 2021 | 5:22 PM

హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధలు ఎక్కువవ్వడంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

Hyderabad: పిల్లలతో కలిసి భార్య సరుకులు తెచ్చేందుకు వెళ్లింది.. తిరిగొచ్చేసరికి భర్త ఇలా చేశాడు
Follow us on

హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధలు ఎక్కువవ్వడంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన నడిశెట్టి బాలశ్రీధర్ (44) నాలుగేళ్లుగా ఓ ప్రముఖ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.  ఎస్.ఆర్.నగర్‌ పరిధిలోని వెంగళరావు నగర్‌ డివిజన్ సిద్ధార్థ నగర్‌లో భార్య, పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. మంచి జాబ్ ఉండి.. కుటుంబ పరంగా ఇబ్బందులు లేకపోవడంతో..  ఫ్రెండ్స్‌తో పాటు బంధువులకు భారీగా అప్పులు ఇచ్చాడు. వారు సకాలంలో తిరిగివ్వకపోవంతో అవసరాల కోసం బయట అప్పులు చేశాడు.

తన వద్ద తీసుకున్నవారు ఇవ్వకపోవడం.. తాను ఇవ్వాల్సినవారు ఒత్తిడి చేయడంతో బాలశ్రీధర్ తీవ్ర మానసిక వేధనను అనుభవించేవాడు. ఈ నేపథ్యంలో గతంలో కూడా ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాడు.  భార్య పద్మ ఆదివారం ఉదయం పిల్లలతో కలిసి డీమార్ట్‌కి వెళ్లగా బాలశ్రీధర్ ఇంట్లోనే ఉన్నాడు. కాసేపటి తర్వాత ఇంటికి పద్మ ఇంటికి తిరిగొచ్చేసరికి అతడు ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. షాక్ గురైన పద్మ గట్టిగా కేకలు వేయగా స్థానికులు వచ్చి అతడిని కిందికి దించారు. అప్పటికే బాలశ్రీధర్ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు ఆధారంగా ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

అనంతపురం జిల్లాలో పెనువిషాదం.. బైక్‌పై వెళ్తుండగా విద్యుత్‌ తీగలు తెగిపడి తల్లీకుమారుడు సజీవదహనం

నేడు భీష్మ ఏకాదశి.. ఆ పాత్రలో నటించిన ఈ టాలీవుడ్ అగ్ర హీరో ఎవరో గుర్తుపట్టండి..?