
అమీన్‌పూర్, ఫిబ్రవరి 28: సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం (ఫిబ్రవరి 27) చోటు చేసుకుంది. అమీన్‌పూర్ ఎస్సై ఈవీ రమణ తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌లోని దుర్గా హోమ్స్ ఫేజ్-2 విల్లాలో నివాసం ఉంటోన్న కొల్లాటి కాశీ విశ్వనాథ్ (38) మాదాపూర్‌లో ఎక్లాట్ ప్రైమ్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. ఈ కంపెనీకి ఆయనే సీఈవోగా పనిచేస్తున్నారు. 6 నెలల కిందట ఆయన అమెరికాకు వెళ్లాడు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కంపెనీ బ్రాంచ్‌ను అమెరికాలో కూడా ఏర్పాటు చేయాలని అక్కడికి వెళ్లారు. అయితే కొన్ని కారణాల వల్ల అక్కడ కంపెనీ ఏర్పాటు కుదరలేదు. దీంతో అమెరికా నుంచి విశ్వనాథ్ తిరిగొచ్చాడు. అమెరికాలో కంపెనీ బ్రాంచ్ ఏర్పాటు చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న విశ్వనాథ్, అది కుదరక పోవడంతో తీవ్ర మనస్తాపం చెందారు. అ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో తన ఇంటి కిటికీకి చున్నీ తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. విశ్వనాథ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పటాన్‌చెరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విశ్వనాథ్ భార్య వినీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
భర్త మృతిని తట్టుకోలేక ఏడో అంతస్తు నుంచి దూకి భార్య ఆత్మహత్య.. నవదంపతుల విషాదాంతం
పెళ్లైన 3 నెలలకే ఆ నవదంపులను మృత్యువు తమను వెంటాడుతోందని తెలుసుకోలేకపోయారు. 3 నెలల కిందట ఢిల్లీలోని గాజియాబాద్‌కు చెందిన అభిషేక్ అహ్లూవాలియా (25)కు అంజలి అనే యువతితో వివాహం జరిగింది. ఢిల్లీలోని వైశాలిలోని ఓ అపార్ట్‌మెంటులో వీరు కాపురం ఉంటున్నారు. సోమవారం ఇద్దరూ అక్కడే ఉన్న జూ పార్క్‌కు వెళ్లారు. అయితే అక్కడ అభిషేక్‌కు ఉన్నట్లుండి ఛాతీలో నొప్పి రావడంతో స్నేహితులు గురుతేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ అభిషేక్ మృతి చెందాడు. దీంతో అభిషేక్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. క్షణాల్లో నిర్జీవంగా మారిన భర్త మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయిన అంజలి.. వారు ఉంటున్న అపార్ట్‌మెంట్ ఏడో అంతస్తులోని బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రగాయాలపాలైన ఆమెను వైశాలిలోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసింది. నవదంపతులు ఇద్దరూ అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లో అంతులేని విషాదం చోటు చేసుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.