Hyderabad: పెళ్లైన నెల రోజులకే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. కారణమేంటంటే
ఆమెకు పెళ్లంటే ఇష్టం లేదు. అయినా ఇంట్లో వాళ్లు వివాహం చేశారు. సంతోషంగా కలిసుంటారని నగరంలో కొత్త కాపురం పెట్టించారు. పెళ్లై నెల రోజులైనా కాకముందే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు...

ఆమెకు పెళ్లంటే ఇష్టం లేదు. అయినా ఇంట్లో వాళ్లు వివాహం చేశారు. సంతోషంగా కలిసుంటారని నగరంలో కొత్త కాపురం పెట్టించారు. పెళ్లై నెల రోజులైనా కాకముందే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామానికి చెందిన తులసి జ్యోత్స్న కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె భర్త గతంలోనే చనిపోవడంతో కుట్టు పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమార్తె జితేంద్రిత సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తోంది. ఆమెకు పెళ్లి అంటే ఇష్టం లేదు. దీంతో గతంలోనే చిన్న కుమార్తెకు పెళ్లి చేశారు. కొంత కాలం తర్వాత మార్చి 27న వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంతోశ్‌తో జితేంద్రిత వివాహం జరిపించారు. వీరు హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలోని ధర్మారెడ్డి కాలనీలో పది రోజుల క్రితం అద్దెకు దిగారు.
జితేంద్రిత వర్క్ ఫ్రం హోమ్ చేస్తుండగా సంతోశ్ ఆఫీస్ కు వెళ్తున్నారు. రోజూలాగే ఆఫీస్ సంతోశ్ ఆఫీస్ కు వెళ్లి, రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చాడు. ఎంతకు తలుపు తీయకపోవడంతో ఇరుగు పొరుగు సాయంతో తలుపులు పగల కొట్టారు. అయితే అప్పటికే జితేంద్రిత ఉరేసుకుని చనిపోయింది. ఇష్టం లేని వివాహమే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read
IPL 2022: ఆ బౌలర్‌ను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడ్డా.. అశ్విన్ అడిగిన ప్రశ్నకు జోస్ బట్లర్ సమాధానం..