IPL 2022: ఆ బౌలర్‌ను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడ్డా.. అశ్విన్ అడిగిన ప్రశ్నకు జోస్ బట్లర్ సమాధానం..
ఐపీఎల్ 2022 (IPL 2022)లో జోస్ బట్లర్(Jos Buttler) రన్ మెషిన్‌గా మారాడు. రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు...
ఐపీఎల్ 2022 (IPL 2022)లో జోస్ బట్లర్(Jos Buttler) రన్ మెషిన్‌గా మారాడు. రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతను ఈ సీజన్‌లో ఏకంగా మూడు సెంచరీలతోపాటు 2 హాఫ్ సెంచరీలు చేశాడు. అతను ఇప్పటి వరకు 7 మ్యాచ్‌ల్లో 491 పరుగులు దండుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేస్‌లో మొదటి స్థానంలో ఉన్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న ఇతన్ని ఓ బౌలర్ ఇబ్బంది పెట్టాడట. ఈ విషయాన్ని స్వయంగా బట్లరే చెప్పాడు. ” ఒక బౌలర్ ఉన్నాడు, అతన్ని ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడ్డా” అని బట్లర్ చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు, అతను రాజస్థాన్ రాయల్స్ యూట్యూబ్ ఛానెల్‌లో అశ్విన్(Ashwin) అడిగిన కొన్ని ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
ఇందులో అశ్విన్ బట్లర్‌ను ఓ ప్రశ్న అడిగాడు. అదేమిటంటే.. ఏ బౌలర్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డవు అని జోస్ బట్లర్‌ను అశ్విన్ అడిగాడు. దీనిపై బట్లర్ సమాధానం ఇచ్చాడు. తను కుల్దీప్ సేన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డానని చెప్పాడు. 25 ఏళ్ల కుల్దీప్ సేన్ రాజస్థాన్ రాయల్స్ నెట్స్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్ అని బట్లర్ చెప్పాడు. దీనికి అశ్విన్ కూడా అంగీకరించి కుల్దీప్ సేన్ స్పీడ్‌ని మెచ్చుకున్నాడు.
భారత పేస్ అటాక్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన కుల్దీప్ సేన్ సరికొత్త సంచలనం. అతను IPL 2022లో లక్నో సూపర్ జెయింట్‌తో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో సేన్ చివరి ఓవర్‌లో చక్కగా బౌలింగ్ చేయడం ద్వారా జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్‌లో అత్యంత వేగంగా బంతిని బౌలింగ్ చేసినందుకు అవార్డు కూడా అందుకున్నాడు.
మరిన్నిఐపీఎల్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి
Read Also.. దిమ్మతిరిగే ఫీల్డింగ్.. కేవలం స్లిప్‌లోనే తొమ్మిది మంది.. సెట్టప్ చూస్తే ఫ్యూజులు ఔట్..!