మహానగరంలో మాయగాడు.. పైన ఫోటోలో చూడ్డానికి సాదాసీదా కన్పిస్తోన్న ఈ శాల్తీనే మిస్టర్ మురుగేషన్. గంజాయి దందాలో ఏక్ నెంబర్ కేటుగాడు. ఖాకీలకు చిక్కాక ఇలా క్లోజ్ షాట్‌లో ఫోటో రిలీజైంది. చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి నింపి.. హోమ్ డెలివరీ చేయడం ఇతడి స్పెషాలిటీ. ఒక్కో ప్యాక్‌లో 15 గ్రాముల గంజాయి నింపుతాడు. ఒక్కో ప్యాక్ ధర 4 వందల నుంచి 6వందలు. ఫిక్స్‌డ్ రేటేం కాదు. డిమాండ్‌ను బట్టీ పైసా వసూల్ చేస్తుంటాడు మురుగేష్. స్పెషల్ ఆఫర్స్ కూడా వుంటాయి. సిగరెట్ గంజాయికి ఎక్స్‌ట్రా రేటు. ధూల్‌పేట(Dhoolpet) అడ్డాగా కొన్నాళ్లుగా మురుగేషన్ గంజాయి దందాలో ఆరితేరాడు. పలుమార్లు పోలీసులకు పట్టుపట్టాడు. కేసులు కూడా ఫైలయ్యాయి. బండి కూడా పోయింది. ఐనా సరే దందాను మాత్రం మారలేదు. సొంత బండి వాడితే ఖాకీలకు చిక్కక తప్పదని ఖతర్నాక్ ఐడియా వేశాడు. సులభం..సురక్షితంగా..తక్కువ ధరతో గమ్యస్థానానికి చేర్చేలా అందుబాటులోకి వచ్చిన టూవీలర్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను బాగా వాడేసుకున్నాడు.
పార్శిల్ డోర్ డెలవరీ.. డైరెక్ట్‌గా కస్టమర్‌కు చెంతకు..ఈ రెండింటి కోసం ఉత్సాహంగా..ఉల్లాసంగా టూవీలర్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను పావుగా చేసుకున్నాడు. జేబులో గంజాయి కవర్… బైక్ రైడర్‌కు డౌట్ రాకుండా వుండేలా స్మార్ట్‌ఫోన్, చేతిలో న్యూస్ పేపర్‌తో మిస్టర్ మర్యాద రామన్నలా బిల్డప్ ఇచ్చేవాడు. రైడర్ కాన్‌సేన్‌ట్రేషన్ పికప్ అండ్ డ్రాపింగ్ పాయింటే మీదే వుంటదిగానీ..వీడి జేబులో ఏముందని చూడరుగా. అలా ఐడియా వర్కవుటయింది. కానీ పక్కా నిఘా పెట్టిన ఖాకీలకు మురుగేషన్ చిక్కాడు. ఆరా తీస్తే రాపిడ్ స్మగ్లింగ్ ఫోర్స్ లాజిక్ బయటపడింది. రాపిడో బుకింగ్ ద్వారా డెయిలీ 20 మందికి సరకు సప్లయ్ చేసేవాడని.. 200 పార్శిల్ బుకింగ్‌లు వున్నాయని దర్యాప్తులో తేలింది. మురుగేషన్‌ను అరెస్ట్ చేసిన మల్కాజ్‌గిరి పోలీసులు, అతన్నించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల అల్లూరి జిల్లాలో పుష్ప మార్క్ స్మగ్లింగ్ యవ్వారం.. తాజాగా హైదరాబాద్ మురుగేష్ రాపిడ్ స్మగ్లింగ్ యాక్షన్…ఇవే కాదు ఇంతకు మించిన సిత్రాలు ఇంకా ఎన్నెన్నో. దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి పట్టుబడిన లింకులు, డొంకలు తెలుగు రాష్ట్రాల్లో కదులుతున్నాయి. విశాఖ ఏజెన్సీ.. ఏవోబీ నుంచి ఏటా 5వేల కోట్ల విలువైన గంజాయి గట్టు దాటుతోంది. ఒడిశా, కేరళ, కర్నాటక, చెన్నై, మహారాష్ట్ర అలా అలా విదేశాలకు స్మగ్లింగ్ చేస్తోంది గంజాయి మాఫియా. తెలంగాణ గట్టుపైన కూడా గంజాయి గుప్పుమంటూనే ఉంది. ఓవైపు ఖాకీలు ఉక్కుపాదం మోపుతున్నా మరోవైపు గంజాయిగాళ్లు బరితెగిస్తూనే ఉన్నారు. నగరం నడిబొడ్డున టూవీలర్ స్మగ్లింగ్ మంత్ర..సంచలనం రేపింది. మురుగుష్ దొరికాడు. ఇతనిలా ఇంకెంత మంది ఇస్మార్ట్‌గా దందా నడిపిస్తున్నారు? మురుగేష్ రాపిడో బైకులను వాడుకున్నాడు..కానీ సదరు బైకర్లకు కానీ సంస్థ కానీ ఈ విషయం తెలియదని..కేసుతో సంబంధంలేదన్నారు పోలీసులు. ఇలా కూడా స్మగ్లింగ్ జరుగుతుందా?..మురుగేష్ ఎపిసోడ్‌తో ఆశ్చర్యం తెరపైకి వచ్చింది. బైకర్లు జరభద్రం. కస్టమర్లు దేవుళ్లలాంటి వాళ్లే.కానీ అందరు కస్టమర్లు ఒకలా ఉండరు. ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చినా.. సర్వీస్ ఆఫర్ చేసినా జర అప్రమత్తంగా వుండాలి. సదరు శాల్తీపై డౌట్ వస్తే ఏం చేయాలి. విత్ ఔట్ డౌట్..100కు డయల్ చేయాల్సిందే.