ఆ టూవీలర్ చలాన్లను చూసి కంగుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఇంతకీ ఎంతంటే..?

ఓ టూవీలర్ వాహనంపై ఏకంగా 69 పెండింగ్‌ చలాన్లు ఉండడం ట్రాఫిక్‌ పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది.

ఆ టూవీలర్ చలాన్లను చూసి కంగుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఇంతకీ ఎంతంటే..?

Edited By:

Updated on: Jan 30, 2021 | 9:06 AM

69 pending challans on two wheeler : ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదు.. పది.. అంతకంటే కాదు.. ఓ టూవీలర్ వాహనంపై ఏకంగా 69 పెండింగ్‌ చలాన్లు ఉండడం ట్రాఫిక్‌ పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. ట్రాఫిక్‌ పోలీసులు సదరు ద్విచక్ర వాహనాన్ని గుర్తించి ఆ చలాన్లకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఉదయం సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇంతలో ఏపీ 12 ఈజీ 8524 నెంబర్‌ బైక్‌పై వస్తున్న పాతబస్తీలోని మచిలీకమాన్ ప్రాంతానికి చెందిన రిషబ్ గుప్తాను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. అతని వాహనానికి సంబంధించిన చలాన్లను ఆన్‌లైన్‌లో చెక్‌ చేశారు.

దీంతో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 69 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అవాక్కయ్యారు. అప్పటికప్పుడే సదరు వాహనదారుడు మొత్తం రూ.21,270 పెనాల్టీ కట్టాల్సి ఉందని నిర్ధారించారు. దీంతో అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చలాన్ల మొత్తాన్ని చెల్లించడంతో టూవీలర్ వాహనాన్ని అతని అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Read Also…  ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ఐదుగురికి తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం