TS Schools Reopen: నేటి నుంచి తెలంగాణలో స్కూళ్లు పున:ప్రారంభం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

|

Sep 01, 2021 | 7:43 AM

TS Schools Reopen: తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. రెసిడెన్షియల్, గురుకులాలు మినహా మిగతా అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులను నిర్వహించనున్నారు.

TS Schools Reopen: నేటి నుంచి తెలంగాణలో స్కూళ్లు పున:ప్రారంభం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Schools
Follow us on

సుమారు 16 నెలల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. హైకోర్టు ఆదేశాల మేరకు గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లను మినహాయించి మిగతా పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. కోవిడ్ నిబంధనలను అనుసరించి అన్ని స్కూళ్లల్లో ప్రత్యక్ష తరగతులను నిర్వహిస్తున్నారు. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ క్లాసులు కూడా జరుగుతాయి. అయితే టీచర్లు, పిల్లలు, అలాగే వారిని స్కూల్‌కు తీసుకెళ్లేవారు ఎంతవరకు కరోనా నిబంధనలను పాటిస్తారన్నదే ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.

ఇదిలా ఉంటే పిల్లలను స్కూళ్లకు పంపాలని తల్లిదండ్రులపై యాజమాన్యాలు ఒత్తిడి తీసుకురకూడని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అటు ప్రత్యక్ష బోధనపై విద్యార్ధులను బలవంతం చేయొద్దని పేర్కొంది. పాఠశాలలో ఉన్నప్పుడు ఏ విద్యార్ధి అయినా వైరస్ బారినపడితే యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని.. ఒకవేళ అలా చేస్తే స్కూళ్ల అనుమతులు రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.

మరోవైపు పిల్లలను స్కూళ్లకు పంపేటప్పుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు అంటున్నారు. పిల్లలు మాస్కులు ధరించేలా, శానిటైజర్ వాడేలా చూసుకోవాలి. వీలైనంత వరకు పిల్లల్ని పేరెంట్స్ బడి దగ్గర దింపాలి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకు స్నానం చేయించాలని అంటున్నారు.

ఇవి చదవండి: