
యూట్యూబ్‌లో వచ్చిన ఓ యాడ్‌పై క్లిక్ చేసిన వ్యక్తి రూ.3.92 లక్షలు కోల్పోయిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెల్తే.. సైదాబాద్‌కు చెందిన 65 ఏళ్ల ప్రైవేట్ స్కూల్ టీచర్‌కు యూట్యూబ్ చూస్తుండగా ఒక యాడ్ కనిపించింది.ఆ యాడ్‌లో వచ్చిన రీడింగ్ గ్లాసెస్‌ను చూసిన అతను వాటిని కొనాలనుకొని.. ఆ లింక్ ద్వారా ఒక వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాటిని ఆర్డర్ చేశాడు. అయితే ‘ఇకార్ట్’ కొరియర్ సర్వీస్ ద్వారా అతని ఆర్డర్ వచ్చింది. అయితే అతను బుక్ చేసిన వైట్ కలర్ బదులు బ్లాక్ కలర్ గ్లాసెస్ వచ్చాయి.
చాట్ జీపీటీ ద్వారా కస్టమర్ కేర్ వేట
గ్లాసెస్ కలర్ మారిపోవడంతో ఆర్డర్ రేప్లేస్ చేద్దామనుకున్న టీచర్.. చాట్ జీపీటీ యాప్‌లో ఇకార్ట్ కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్ నంబర్ కోసం వెతికారు. అయితే అతనికి చాట్‌జీపీటి ఒక నెంబర్ సజెస్ చేయగా.. ఆయన ఆ నంబర్‌కు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి బాధితుడి ఆర్డర్ నంబర్, డెలివరీ ఐడీ వివరాలను తీసుకుని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని నమ్మబలికాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికే కస్టమర్ కేర్ ప్రతినిధిగా నటిస్తూ ఒక వ్యక్తి అతనికి వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. సమస్య పరిష్కారం అవ్వాలంటే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని.. Customer Support.apk అనే పేరున్న ఒక అప్లికేషన్‌ను పంపాడు. అది నిజమేనని నమ్మిన ఆ టీచర్ దాన్ని తన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేశాడు. అంతే ఆ సైబర్ నేరగాళ్లు క్షణాల్లో ఆ టీచర్ ఖాతా నుంచి రూ.3.92 లక్షలు కాజేశారు. దీంతో తన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయం అవ్వడాన్ని గమనించిన బాధితుడి వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన తర్వాత పోలీసులు జనాలకు కొన్ని కీలక హెచ్చరికలు జారీ చేశారు. గూగుల్ లేదా ఏఐ టూల్స్‌లో దొరికే కస్టమర్ కేర్ నంబర్లను గుడ్డిగా నమ్మవద్దు. అలాగే గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్‌లో పంపే ఎలాంటి .apk ఫైళ్లను ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయకూడదని తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.