తండ్రి అంత్యక్రియల కోసం.. నగరానికి చేరుకున్న సత్య నాదెళ్ల..

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ ఇంట్లో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ శుక్రవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నంబర్- 2 లోని సాగర్ సొసైటీలో గల తన నివాసంలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే కుమారుడైన సత్య నాదెళ్ల రాక కోసం.. ఆయన మృతదేహాన్ని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ దవాఖాన మార్చురీలో భద్రపరిచారు. ఇప్పటికే సత్య నాదెళ్ల హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో […]

  • Publish Date - 10:18 am, Sun, 15 September 19 Edited By:
తండ్రి అంత్యక్రియల కోసం.. నగరానికి చేరుకున్న సత్య నాదెళ్ల..

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ ఇంట్లో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ శుక్రవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నంబర్- 2 లోని సాగర్ సొసైటీలో గల తన నివాసంలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే కుమారుడైన సత్య నాదెళ్ల రాక కోసం.. ఆయన మృతదేహాన్ని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ దవాఖాన మార్చురీలో భద్రపరిచారు. ఇప్పటికే సత్య నాదెళ్ల హైదరాబాద్ చేరుకున్నారు.
ఇవాళ హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీఎన్‌ యుగంధర్‌.. 1962 సివిల్‌ సర్వీస్‌ బ్యాచ్‌కు చెందిన వారు. 1983-85 మధ్య అప్పటి సీఎం ఎన్టీఆర్‌ వద్ద పనిచేశారు. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తీర్చిదిద్దడంలో యుగంధర్ కీలకపాత్ర పోషించారు. అలాగే ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో.. ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యుడిగా, లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ డైరెక్టర్‌గా సేవలందించారు. అనంతపురం జిల్లా బుక్కాపురంలో జన్మించిన యుగంధర్‌.. తన పేరులో బుక్కాపురం నాదెళ్ల యుగంధర్‌గా రాసుకున్నారు. ఆయన భార్య గతంలోనే కన్నుమూశారు. వారి ఏకైక సంతానం సత్య నాదెళ్ల. ప్రస్తుతం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న విషయం తెలిసిందే. బీఎన్‌ యుగంధర్‌ మృతిపట్ల తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌.జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. యుగంధర్‌ కుటుంబానికి, ఆయన కుమారుడు సత్య నాదెళ్లకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.