డెంగ్యూ పై టీవీ9 సమరం.. అవగాహన సదస్సులు ఏర్పాటు..

డెంగ్యూ పై టీవీ9 సమరం.. అవగాహన సదస్సులు ఏర్పాటు..

తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ ఫీవర్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. విషజ్వరాలు విజృంభిస్తుండటంతో ఆసుపత్రలన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలో డెంగ్యూ ఫీవర్‌ పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో పారిశుద్ధ్యం పై అవగాహన తీసుకువచ్చేందుకు డెంగ్యూ పై టీవీ9 సమరం కార్యక్రమాన్ని చేపట్టింది. ఖమ్మం మధిర మున్సిపాలిటీ ఎస్సీ కాలనీలో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కమల రాజ్, మున్సిపల్ కమిషనర్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 15, 2019 | 8:29 AM

తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ ఫీవర్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. విషజ్వరాలు విజృంభిస్తుండటంతో ఆసుపత్రలన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలో డెంగ్యూ ఫీవర్‌ పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో పారిశుద్ధ్యం పై అవగాహన తీసుకువచ్చేందుకు డెంగ్యూ పై టీవీ9 సమరం కార్యక్రమాన్ని చేపట్టింది. ఖమ్మం మధిర మున్సిపాలిటీ ఎస్సీ కాలనీలో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కమల రాజ్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, వైద్య సిబ్బంది, అంగన్ వాడీ ఆశా కార్యకర్తలు పాల్గొననున్నారు. పశ్చిమగోదావరి దెందులూరులో ఎమ్మెల్యే అబ్బాయచౌదరి కాలనీల్లో తిరిగి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు డెంగ్యూ ఎఫెక్ట్ పై తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. మంత్రి కేటీఆర్‌ ప్రగతిభవన్‌లో స్వయంగా ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ని ప్రారంభించి.. డెంగ్యూపై యుద్ధాన్ని ప్రకటించారు. సీజనల్‌ వ్యాధుల నివారణ ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందన్నారు. బహిరంగ ప్రదేశాలు, పట్టణ ప్రాంతాల్లో – మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ తరుపున దోమల నివారణతో పాటు పరిశుభ్రత కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దోమల వృద్దికి అవకాశం ఉన్న నీటి తొట్లు , నిలువ ప్రదేశాల్లో నీటిని తొలగించేందుకు ప్రభుత్వ అధికారులు, మునిసిపల్‌ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మంత్రులు స్వయంగా రంగంలోకి దిగారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాన్ని డెంగ్యూ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చర్యలు వేగవంతం చేశారు. కలెక్టర్ రోనాల్డ్ రోస్ తో కలిసి మహబూబ్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి డెంగ్యూ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో డెంగ్యూ నివారణ చర్యలకు కదిలిన సిబ్బంది ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. డెంగ్యూ వ్యాధి నివారణ ప్రభుత్వ బాధ్యత ఒక్కటే కాదని పౌరులు కూడా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించి డెంగ్యూ నివారణలో కలిసి రావాలన్నారు.

డెంగీ జ్వరాలు సహజంగా 104 డిగ్రీల ఫారిన్‌ హీట్‌ వరకు ఉంటుంది. తగ్గినట్లే తగ్గి జ్వరం పెరుగుతూ ఉంటుంది. తలనొప్పి, కండరాలు, కీళ్లనొప్పులు ఉంటాయి. వికారంగా వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది. కళ్ల వెనుక నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఉమ్మినీటి గ్రంథులు వాచినట్లు అనిపిస్తుంది. శరీరంపై ఎర్రగా దద్దుర్లు వస్తాయి. ఈ లక్షణాలు కనిపించగానే ఆలస్యం చేయడకుండా వైద్యలను పంప్రదించాలని టీవీ9 సూచిస్తుంది.అన్ని రోగాలకు మన పరిసరాల అపరిశుభ్రతే కారణం గనుక ఆదివారం అపరిశుభ్రంపై యుద్ధం చేయాలని టీవీ9 పిలుపునిచ్చింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu