Special Trains: ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో..

సంక్రాంతి రష్‌ నాన్‌స్టాప్‌గా కొనసాగుతోంది. వేలాది వాహనాలతో హైదరాబాద్‌ - విజయవాడ హైవే కిటకిటలాడుతోంది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కాలు పెట్టడానికి కూడా చోటు లేనట్లుగా మారిపోయాయి. ఎలాగైనా సంక్రాంతి పండక్కి ఊరికి వెళ్లాల్సిందేనని ఓ చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు జనాలు.. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో శుభవార్త చెప్పింది.

Special Trains: ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో..
Sankranti Special Trains

Edited By:

Updated on: Jan 12, 2026 | 9:04 AM

సంక్రాంతి రష్‌ నాన్‌స్టాప్‌గా కొనసాగుతోంది. వేలాది వాహనాలతో హైదరాబాద్‌ – విజయవాడ హైవే కిటకిటలాడుతోంది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కాలు పెట్టడానికి కూడా చోటు లేనట్లుగా మారిపోయాయి. ఎలాగైనా సంక్రాంతి పండక్కి ఊరికి వెళ్లాల్సిందేనని ఓ చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు జనాలు.. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో శుభవార్త చెప్పింది. వివిధ ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు వెళ్లే వాళ్ల కోసం ఇప్పటికే.. భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. పెద్ద సంఖ్యలో పట్టణం నుంచి పల్లెటూరికి వెళుతున్న ప్రయాణికులకు అనువుగా దక్షిణ మధ్య రైల్వే 11 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

సంక్రాంతికి ముందు నడిచే ప్రత్యేక రైళ్లు ఇవే..

హైదరాబాద్ దక్కన్ నాంపల్లి-కొల్లం జంక్షన్ (07193) 11న మధ్యాహ్నం 12.15 గంటలకు బయల్దేరి 12న సాయంత్రం 4.50గంటలకు చేరుతుంది.

తిరుపతి సూపర్ ఫాస్ట్ అకోలా జంక్షన్- తిరుపతి (07606) 12న రాత్రి 10.50 బయల్దేరి 13న ఉదయం 6.25గంటలకు చేరుతుంది.

చర్లపల్లి స్పెషల్ పండరపూర్-తిరుపతి (07032) 12న రాత్రి 7.30గంటకు బయల్దేరి 13న రాత్రి 10.30గంటలకు చేరుతుంది.

చర్లపల్లి- తిరుచానూరు (07017) 12న ఉదయం 4.30గంటలకు బయల్దేరి 13న ఉదయం 11.15 గంటలకు చేరుతుంది.

ఆల్ఫా- తిరుచానూరు (07609) 13న ఉదయం 8.18గంటలకు బయల్దేరి 14న ఉదయం 10.45గంటలకు చేరుతుంది.

చర్లపల్లి-కొల్లం జక్షన్ (07113) 14న సాయంత్రం 4.15గంటలకు బయల్దేరి 15న ఉదయం 5.40గంటలకు చేరుతుంది.

హజూర్ సాహిద్ నాందేడ్ – తిరుచ్చిరాపల్లి జంక్షన్ (07615) 14న ఉదయం 8.55 గంటలకు బయల్దేరి 15న మధ్యాహ్నం 12.10కి చేరుతుంది.

కాచిగూడ-తిరుచానూరు (07787) 14న ఉదయం 4.30గంటలకు బయల్దేరి 15న ఉదయం 11.30గంటలకు గమ్యం చేరుతుంది.

చర్లపల్లి- కొల్లం జంక్షన్ (07135) 15న సాయంత్రం 5.55 గంటలకు బయల్దేరి 16 ఉదయం 4.30గంటలకు చేరుతుంది.

హైదరాబాద్ దక్కన్ నాంపల్లి-కన్యాకుమారి (07230) 15న ఉదయం 5.40గంటలకు బయల్దేరి 16న ఉదయం 11.10గంటలకు చేరుతుంది.

చర్లపల్లి-తిరుపతి (07001) 15న ఉదయం 7గంటలకు బయల్దేరి 16న ఉదయం 11.30గంటలకు గమ్యం చేరుతుంది.

సంక్రాంతి తర్వాత నడిచే రైళ్లు..

తిరుపతి- పండరాపూర్ (07012) 18న సాయంత్రం 4.40గంటలకు బయల్దేరి 19న అర్ధరాత్రి 12.05 గంటలకు చేరుతుంది.

కొల్లం జంక్షన్-హజూర్ సాహిద్ నాందేడ్ (07112) 18న అర్థరాత్రి 12.50 బయల్దేరి 19న రాత్రి 9.55 గంటలకు చేరుతుంది.

తిరుచానూరు-చర్లపల్లి (07018) 18న సాయంత్రం 4.40గంలకు బయల్దేరి 19 అర్ధరాత్రి 12.10గంటలకు చేరుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..