రిపబ్లిక్‌డే స్పెషల్.. రోహిణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంధ బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సినేషన్

|

Jan 26, 2025 | 4:15 PM

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బుధవారం రోహిణీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన దేవనార్‌ అంధుల పాఠశాలకు చెందిన పలువురు బాలికలు పెద్ద ఎత్తున ఈ టీకా డ్రైవ్ లో పాల్గొన్నారు

రిపబ్లిక్‌డే స్పెషల్.. రోహిణి ఫౌండేషన్  ఆధ్వర్యంలో అంధ బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సినేషన్
Rohini Foundation
Follow us on

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రోహిణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం (జనవరి 26) అంధులైన బాల బాలికలకు ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ టీకా డ్రైవ్ లో హైదరాబాద్ కు చెందిన దేవనార్‌ అంధుల పాఠశాలకు చెందిన పలువురు బాలికలు పెద్ద ఎత్తున ఈ టీకా కార్యక్రమంలో పాల్గొన్నారు. దృష్టిలోపం, వినికిడిలోపం ఉన్న బాల బాలికలు, అనాథ శరణాలయాల్లో ఉన్న విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించినట్లు రోహిణీ ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ‘ ఆడ పిల్లలకు ఆరోగ్యకరమైన సమాజాన్నిఅందించడమే లక్ష్యంగా మా రోహిణీ ఫౌండేషన్ ముందుకు సాగుతోంది. ‘అనాథ బాలికలు, దృష్టి, వినికిడి లోపంతో సహా వివిధ అంగ వైకల్య సమస్యలతో బాధపడేవారికి మా వంతు సాయంగా ఈ వైద్య సేవలు అందిస్తున్నాం. ముందుగానే ఆరోగ్య సంరక్షణను అందించడం ద్వారా, ఈ పిల్లలను సురక్షితమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు నడిపించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, ఫౌండేషన్ వైద్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు రోహిణీ ఫౌండేషన్ ప్రతినిధులు.

కాగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు సేవలందిస్తోంది రోహిణి ఫౌండేషన్. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేయించుకోలేని పిల్లలకు ఈ వైద్య సాయం అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, వినికిడి పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉచిత సేవలు అందిస్తున్నారు.

Rohini Foundation 1

 

ఇవి కూడా చదవండి

కాగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, విజువల్లీ ఛాలెంజ్డ్ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా పిల్లలను గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నట్లు రోహిణి ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

Rohini Foundation 2

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..