Hyderabad: బీజేపీ ‘విజయ సంకల్ప’ సభకు విచ్చేసిన గద్దర్.. మోదీ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్
బీజేపీ విజయసంకల్ప సభకు హాజరైన గద్దర్ హాజరయ్యారు. మోదీ ఏం మాట్లాడతారో వినడానికి వచ్చానని ఆయన తెలిపారు.
BJP national executive meeting: పరేడ్ గ్రౌండ్స్ జనసందోహంగా మారింది. మోదీ(PM Modi) సభకు పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు, జనం తరలివచ్చారు. గేట్ నెంబర్ నాలుగు నుంచి సాధారణ జనాన్ని పంపిస్తున్నారు. కాషాయ రంగు టీషర్ట్‌లు, కండువాలతో హాజరయ్యారు కార్యకర్తలు. భారత్ మాతాకీ జై అని నినాదాలు చేస్తూ లోపలకు వెళ్తున్నారు. అందరినీ చెక్ చేసి లోపలకు పంపిస్తున్నారు పోలీసులు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ఎక్కడ చూసినా పోలీస్ పహారానే కనిపిస్తోంది. బందోబస్తులో దాదాపు 4వేల మంది సిబ్బంది ఉన్నారు. వర్షం వచ్చినా ఇబ్బందుల్లేకుండా జర్మన్ టెంట్లు వేశారు. లోపల లక్షల మందికి సీటింగ్ అరెంజ్ చేశారు. మూడు ప్రధాన వేదికలు హైలైట్‌గా కనిపిస్తున్నాయి. కాగా పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మోదీ సభకు గద్దర్(Gaddar) రావడం ఆసక్తిగా మారింది. వీఐపీ పాస్‌తో ఆయన సభకు హాజరయ్యారు. దేశం, తెలంగాణ గురించి ప్రధాని ఏం చెప్తారో వినడానికే తాను వచ్చానన్నారు గద్దర్. ప్రధాని మోదీ మాట్లాడాక స్పందిస్తానని చెప్పారు.
మరోవైపు హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో రెండోరోజు పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరి జరిగే ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు.