SC Railway: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు

|

Nov 18, 2021 | 10:36 AM

Railway News: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే కొన్ని రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేశారు. ఈ వివరాలను ద.మ.రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

SC Railway: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు
Railway Passenger Alert
Follow us on

Railway News: దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో నడిచే కొన్ని  రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేశారు. ఈ వివరాలను ద.మ.రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. చెన్నై డివిజన్‌లోని తిరుపత్తూర్, జోలార్‌పేటై సెక్షన్‌లో ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. ఈ నెల 20, 24, 27, డిసెంబరు 1 తేదీల్లో (4 రోజులు) రాత్రి 8 గం.ల నుంచి 11.45 గం.ల వరకు ఈ పునరుద్ధరణ పనులు చేపడుతారు. ఈ పనుల కారణంగా కొన్ని రైలు సర్వీసుల రాకపోకల సమయాల్లో ఆ నాలుగు రోజుల్లో మార్పులు చేశారు.

రైలు నెం.17229 తిరువనంతపురం సెంట్రల్ నుంచి సికింద్రాబాద్ జంక్షన్‌కు నడిచే సబరి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 20, 24, 27, డిసెంబర్ 1 తేదీల్లో తిరువనంతపురం సెంట్రల్ నుంచి ఉదయం 7 గం.లకు బదులు.. 3 గం.లు ఆలస్యంగా ఉదయం 10 గం.లకు బయలుదేరుతుంది. ఆ మేరకు సబరి ఎక్స్‌ప్రెస్ రైలు మూడు గంటలు ఆలస్యంగా ఆయా రైల్వే స్టేషన్లకు చేరుకుని.. బయలుదేరుతుంది.

అలాగే రైలు నెం.16526 కేఎస్ఆర్ బెంగళూరు నుండి కన్యాకుమారికి నడిచే ఐలాండ్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 20, 24, 27, డిసెంబరు 01 తేదీల్లో రాత్రి 08.10 గం.లకు బదులు గంట ఆలస్యంగా 09.10 గం.లకు బయలుదేరుతుంది.

మారిన రైళ్ల రాకపోకలకు అనుగుణంగా ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Also Read..

Nayantara Birthday: ప్రియురాలి పుట్టిన రోజు కోసం విఘ్నేష్‌ గ్రాండ్‌ పార్టీ .. హాజరైన సామ్‌.. నెట్టింట్లో ఫొటోలు వైరల్‌..

NIA: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు.. మావోయిస్ట్‌ సానుభూతిపరులే టార్గెట్‌