లాక్‌డౌన్‌ నిబంధనలకు పాతబస్తీ తూట్లు..

|

May 01, 2020 | 10:16 AM

వాళ్లకు చట్టాలు వర్తించవు.. అధికారులంటే లెక్కలేదు. కరోనా వైరస్‌ అంటే అసలే భయంలేదు. లాక్‌డౌన్‌…గీక్‌డౌన్‌ జాంతానై అంటారు.. ఇదేంటని ప్రశ్నిస్తే… కరోనా హమ్‌కో క్యా కరేంగే అనే నిర్లక్ష్యపు సమాధానాలు. ప్రభుత్వాలు, మత పెద్దలు నెత్తినోరూ మొత్తుకుని ఇళ్లలోనే ఉండండిరా… బయటకు రాకండి.. వచ్చి మీతో పాటు.. మీ కుటుంబ సభ్యులు… తోటి మనుషులను ఇబ్బందులు పెట్టకండిరా అంటే వినడం లేదు. ఏ హుకుమత్‌ హమారా అంటూ జులుం ప్రదర్శిస్తున్నారు…ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా..? సాక్షాత్తు రాష్ట్ర రాజధాని […]

లాక్‌డౌన్‌ నిబంధనలకు పాతబస్తీ తూట్లు..
Follow us on

వాళ్లకు చట్టాలు వర్తించవు.. అధికారులంటే లెక్కలేదు. కరోనా వైరస్‌ అంటే అసలే భయంలేదు. లాక్‌డౌన్‌…గీక్‌డౌన్‌ జాంతానై అంటారు.. ఇదేంటని ప్రశ్నిస్తే… కరోనా హమ్‌కో క్యా కరేంగే అనే నిర్లక్ష్యపు సమాధానాలు. ప్రభుత్వాలు, మత పెద్దలు నెత్తినోరూ మొత్తుకుని ఇళ్లలోనే ఉండండిరా… బయటకు రాకండి.. వచ్చి మీతో పాటు.. మీ కుటుంబ సభ్యులు… తోటి మనుషులను ఇబ్బందులు పెట్టకండిరా అంటే వినడం లేదు. ఏ హుకుమత్‌ హమారా అంటూ జులుం ప్రదర్శిస్తున్నారు…ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా..? సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ పాతబస్తీలో పరిస్థితి. లాక్‌డౌన్‌… సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినా వారి చెవులకు ఎక్కడం లేదు. పాతబస్తీలోని కాలనీలో చూసినా రద్దీతో నిండిపోతున్నాయి.

రెడ్‌ జోన్‌లో సైతం కర్ఫ్యూను ఉల్లంఘించి గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఇప్పటికే జంటనగరాల్లో వేలాది వాహనాలు సీజ్‌ చేసి కేసులు పెట్టినా డోంట్‌ కేర్‌ అంటున్నారు. పాతబస్తీలో జనాలను కట్టడి చేయడం అధికారులకు కత్తిమీది సాములా మారింది. పోలీసులు… ఇతర శాఖల అధికారులు బయటకు రావద్దొని చెప్పినా వినిపించుకోవడం లేదు. దీంతో కరోనా కట్టడిలో అనుకున్న ఆశయసాధన ఇక్కడ కనిపించడం లేదు. బయటకు వచ్చిన వారిని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అటు మతపెద్దలు… వివిధ పార్టీల నేతలు రంజాన్‌ మాసాన్ని ఇంట్లోనే గడుపుకోండని చెబుతున్నా పాతబస్తీ వాసులు పెడచెవిన పెడుతున్నారు. కరోనా భారిన పడకూడదంటే సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలన్న విజ్ఙప్తిని వినిపించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాతబస్తీలో పోలీసులు ప్రభుత్వాదేశాలకన్నా తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాడులు చేసినా.. పట్టించుకోకుండా… కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు వెనుకాడటం లేదు. కానీ, వారి సహనాన్ని అలుసుగా తీసుకున్న కొందరు పోకిరిగాళ్లు… రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా కరోనా పాజిటివ్‌ కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అధికంగా రావడంపై ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు వారికి అవగాహణ కల్పించకుంటే… కరోనా మహమ్మారి భారిన పడే ప్రమాదం లేకపోలేదని వాదనలు వినిపిస్తున్నాయి.