Hyderabad: వాడో మానసిక రోగి.. కొత్త జీవితాన్ని ఇద్దామని పెళ్లిడిన సైకాలజిస్ట్.. చివరకు ఊహించని విధంగా

ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి వల్లే జీవితమే నరకంగా మారింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న అతడి బాగు చేద్దామనుకుంటే… చివరికి తన జీవితాన్నే కాల్చేశాడు. సైకాలజిస్ట్ రజిత వాడి వేధింపులు తట్టుకోలేక రెండు సార్లు బలవన్మరణానికి యత్నించగా… చివరికి బ్రెయిన్ డెడ్ అయింది.

Hyderabad: వాడో మానసిక రోగి.. కొత్త జీవితాన్ని ఇద్దామని పెళ్లిడిన సైకాలజిస్ట్.. చివరకు ఊహించని విధంగా
Rohit Rajitha

Edited By:

Updated on: Aug 06, 2025 | 5:29 PM

హైదరాబాద్‌లో ఓ మానసిక వైద్యురాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి వేధింపులతో చివరికి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. బాధితురాలి తండ్రి పోలీస్‌ అధికారి కావడం మరింత సంచలనంగా మారింది. సనత్‌నగర్ జెక్ కాలనీలో నివాసముంటున్న ఓ ఠాణా సబ్ ఇన్‌స్పెక్టర్ నర్సింహగౌడ్ కుమార్తె రజిత (33), ఒక ప్రముఖ ఇంటర్నేషనల్ పాఠశాలలో చైల్డ్ సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఇంటర్న్‌షిప్ సమయంలో బంజారాహిల్స్‌లోని ఓ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న KPHBకి చెందిన బాధితుడు ఆగు రోహిత్ (33) పరిచయమయ్యాడు. తాను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌నని నమ్మబలికి.. ఆమెను ప్రేమిస్తున్నట్లు నమ్మబలికాడు. అతడో మానసిక రోగి.. అందునే ప్రేమను చెబుతున్నాడు.. దీంతో కొత్త జీవితాన్ని ఇద్దామని భావించిన రజిత కూడా అతడిని అంగీకరించింది. తన మానసిక స్థితిని బాగుచేసే బాధ్యతను తీసుకొని, తల్లిదండ్రులను ఒప్పించి అతడిని పెళ్లి చేసుకుంది.

కానీ పెళ్లి తర్వాత రోహిత్ అసలైన రూపం బయటపడింది. ఏ పని చేయకుండా జల్సాలకు అలవాటు పడ్డాడు. రజిత సంపాదించిన జీతాన్ని ఖర్చు చేస్తూ… చెడు అలవాట్ల బానిసయ్యి… మానసికంగా, శారీరకంగా ఆమెను వేధించసాగాడు. డబ్బులు ఇవ్వని సందర్భాల్లో చివరకు రజితను దారుణంగా కొట్టేవాడు. ఈ వేధింపులు తాళలేక గత నెల 16న రజిత నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ఇంటికి తీసుకువచ్చారు. అయితే జూలై 28న రాత్రి ఆమె మళ్లీ బాత్రూమ్ కిటికీ నుంచి కిందకు దూకా ఆత్మహత్యాయత్నం చేసింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అమీర్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై ఎస్.ఆర్.నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..