గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రియల్టర్ అంజిరెడ్డి ధారణ హత్య కలకలం రేపింది.. ఈ నెల 29 న హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన నిందితులను గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు..ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. అంజిరెడ్డి ఆస్తిని కాచేసేందుకు పక్కా పథకం ప్రకారం కుట్ర చేసినట్లు విచారణలో వెల్లడైంది.. నలుగురు బిహారి గ్యాంగ్ తో సహా ప్రధాన నిందితుడు రాజేష్ అనే వ్యక్తి రాజేష్ వద్ద కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.. గత నెల 29న గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సికింద్రాబాద్ డి మార్ట్ లోని సెల్లర్ లో అంజిరెడ్డిని హతమర్చారు నిందితులు.. తన ఆస్తులను అమ్మి అమెరికాకు వెళ్లాలని ఆలోచనలో ఉన్న అంజిరెడ్డి… ఈ నేపథ్యంలో మూడు కోట్ల విలువైన అతని భవనాన్ని కొనుగోలు చేసేందుకు ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా రాజేష్ అంజి రెడ్డికి ఇవ్వడం జరిగింది… మిగతా డబ్బులను చెల్లించకుండా అంజిరెడ్డి భవనాన్ని తన సొంతం చేసుకోవాలని ఉద్దేశంతో రాజేష్ పథకం ప్రకారం అంజిరెడ్డిని పిలిపించి తన వద్ద పనిచేసేటటువంటి వ్యక్తులతో సహా డ్రైవర్ సహాయంతో అంజిరెడ్డిని హత్య చేసినట్లు తెలుస్తోంది…
నగరంలో ఓ NRI, రియల్టర్ హత్య కలకలం రేపింది ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పద్మారావు నగర్ కు చెందిన అంజిరెడ్డి 1993 ,1997 లో చెలికాడు, దొంగ అల్లుడు అనే సినిమాలకు నిర్మాతగా పనిచేశాడు ఈయనకు ఇద్దరు కుమారులు కుమార్తె ఉన్నారు ఒక కుమారుడు మోకిల లో ఉంటుండగా మరో కుమారుడు, కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు ..ఇటీవలే అంజిరెడ్డి తో పాటు ఆయన భార్యకు అమెరికా పౌరసత్వం వచ్చాయి.. దీంతో అక్కడే స్థిరపడాలని భావించిన అంజిరెడ్డి.. నగరంలోని ఉన్న ఆస్తులను విక్రయించాలని నిర్ణయించాడు.. అంజిరెడ్డి నిర్మాతగా ఉండగా సీనియర్ ఫోటోగ్రాఫర్గా పనిచేసిన రవి ఇప్పటికీ స్నేహం కొనసాగుతుంది.. ఈ నేపథ్యంలో తన ఆస్తులు విక్రయం విషయంపై ఎనిమిది నెలల క్రితం రవికి చెప్పి అమెరికా వెళ్లారు అంజిరెడ్డి దంపతులు.
రవి ఈ అంశాన్ని రియల్టర్ తో కూడిన వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు.. నెలరోజుల క్రితం భార్యతో తిరిగి వచ్చిన అంజిరెడ్డి వద్దకు రవి తన వెంట జిఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ తీసుకొని వెళ్ళాడు.. అంజిరెడ్డికి పరిచయమైన రాజేష్ చాలా చనువుగా ఉన్నాడు… 1986లో కట్టిన ఆ ఇంటిపై అంజిరెడ్డికి అతని భార్యకి ఉన్నటువంటి ప్రేమను గమనించిన రాజేష్ వారిని బుట్టలో వేసుకునేలా మాటలు మాట్లాడాడు ఈ విధంగా పథకం ప్రకారం డ్రాఫ్ట్ సిద్ధం చేసి ఆ ఇంటిని సొంతం చేసుకోవాలని రాజేష్ భావించాడు.. ఇందుకోసం రెండు విడతల్లో రెండు కోట్ల నగదు రూపంలో చెల్లించినట్లు, అంజిరెడ్డి వృద్ధుడు కావడంతో ఆయనకు ఏమైనా అయితే 50 లక్షల రూపాయలు ఆయన భార్యకు ఇచ్చినట్లు ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేలా డ్రాఫ్ట్ నమూనా ను ముందుగానే సిద్ధం చేసుకున్నాడు.
అనంతరం ఈ నెల 29న ఐదున్నర గంటలకు వేర్వేరు కార్లలో జి ఆర్ కన్వెన్షన్ లో ఉన్న డీమార్ట్ బిల్డింగ్ కు వచ్చాడు మృతుడు అంజి రెడ్డి. బేస్మెంట్ 3 లో అంజిరెడ్డి కార్ పార్కు చేసిన తర్వాత కీలక నిందితుడు రాజేష్ అతని వద్ద పనిచేసే బిహారీ వ్యక్తులు కార్ డ్రైవర్ దారుణంగా హత్య చేశారు ..ఆ తర్వాత ప్రమాదంగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు ..ఆరోజు రాత్రి 9:15 నిమిషాల ప్రాంతంలో అంజిరెడ్డి కొడుకుకి రవి ఫోన్ చేసి తన తండ్రికి ప్రమాదం జరిగిందని హుటాహుటిన రావాలని కోరాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కీలకమైనటువంటి ఆధారాలను సేకరించి అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేశారు ఈ కేసు కాస్త హత్య కేసుగా మారడంతో కీలక నిందితుడు రాజేష్ తో సహా బిహారి వ్యక్తులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నాడు.. ఇందులో రవి పాత్ర పై కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..