Hyderabad: వీడిన సనత్‌ నగర్‌ బాలుడి హత్య కేసు మిస్టరీ.. మర్డర్‌కు అసలు కారణం అదేనంటా..

|

Apr 21, 2023 | 5:20 PM

హైదరాబాద్‌లోని సనత్‌ నగర్‌లో 8 ఏళ్ల బాలుడి హత్య ఉదంతం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. అబ్దుల్‌ వహీద్‌ అనే కుర్రాడిని ఓ మహిళ నరబలి ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఓ నాలా సమీపంలో బాలుడి మృతదేహం లభించడంతో సదరు మహిళ ఇంటిపై స్థానికులు దాడికి దిగారు. దీంతో...

Hyderabad: వీడిన సనత్‌ నగర్‌ బాలుడి హత్య కేసు మిస్టరీ.. మర్డర్‌కు అసలు కారణం అదేనంటా..
Sanath Murder Case
Follow us on

హైదరాబాద్‌లోని సనత్‌ నగర్‌లో 8 ఏళ్ల బాలుడి హత్య ఉదంతం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. అబ్దుల్‌ వహీద్‌ అనే కుర్రాడిని ఓ మహిళ నరబలి ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఓ నాలా సమీపంలో బాలుడి మృతదేహం లభించడంతో సదరు మహిళ ఇంటిపై స్థానికులు దాడికి దిగారు. దీంతో సనత్‌నగర్‌లోని అల్లాదున్ కోటి ఏరియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇదిలా ఉంటే ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించి, మిస్టరీని చేధించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు బాలుడి హత్యకు నరబలికి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. బాలుడి హత్యకు ఆర్థిక వివాదాలే కారణమని తేల్చి చెప్పారు. హత్యకు సంబంధించిన వివరాలను బాలనగర్‌ డీసీపీ శ్రీనివాసరావు చెబుతూ.. ‘వహీద్‌ను ఇమ్రాన్‌ అనే ట్రాన్స్‌ జెండర్‌ హత్య చేసింది. బాలుడి తండ్రి, ఇమ్రాన్‌ మధ్య చిట్టి విషయంలో గొడవలు ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం బాలుడిని ఆమె ఎత్తుకెళ్లి చంపేసినట్లు విచారణలో తేలింది. వహీద్‌ను హత్య చేసి మృతదేహాన్ని బకెట్‌లో కుక్కినట్లు సాక్ష్యాలు లభించాయి’ అని చెప్పుకొచ్చారు.

ఇక ఓ ఆటో డ్రైవర్‌ సాయంతో మృతదేహన్ని గోనెసంచిలో మూటకట్టి నాలాలో పడేశారని డీసీపీ వివరించారు. బాలుడి కిడ్నాప్‌కు మొత్తం నలుగురు వ్యక్తులు సహకరించారని.. ఈ హత్యకేసులో అయిదుగురిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పుకొచ్చారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ సాగుతున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..