Hyderabad: రౌడీషీట్‌ను ఎత్తేశారని అనుచరులకు అదిరిపోయే పార్టీ.. సడెన్‌గా పోలీసుల ఎంట్రీతో..

|

Nov 06, 2022 | 5:35 PM

శంషాబాద్‌ మండలం రామాంజపూర్‌ గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో రౌడీషీటర్లు పార్టీ ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌జెండర్లతో కలిసి అశ్లీల నృత్యాలు చేస్తుండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. మద్యం, హుక్కా మత్తులో చిందులేస్తున్న ట్రాన్స్‌జెండర్లతోసహా రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Hyderabad: రౌడీషీట్‌ను ఎత్తేశారని అనుచరులకు అదిరిపోయే పార్టీ.. సడెన్‌గా పోలీసుల ఎంట్రీతో..
Police Raids
Follow us on

రంగా రెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ఓ ఫాం హౌస్‌పై ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఐదుగురు రౌడీషీటర్లతోపాటు 47 మందిని ఎస్‌ఓటీ పోలీసుల బృందం అదుపులోకి తీసుకుంది. శంషాబాద్‌ మండలం రామాంజపూర్‌ గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో రౌడీషీటర్లు పార్టీ ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌జెండర్లతో కలిసి అశ్లీల నృత్యాలు చేస్తుండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. మద్యం, హుక్కా మత్తులో చిందులేస్తున్న ట్రాన్స్‌జెండర్లతోసహా రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన ఓ రౌడీషీటర్‌ ముజ్రా పేరుతో పార్టీ అరేంజ్‌ చేశాడు. తనపై ఉన్న రౌడీషీట్‌ను పోలీసులు ఎత్తేయడంతో అనుచరులకు పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చాడు. సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు దాడులు చేసి వారిని అరెస్టు చేశారు. వారి నుంచి సెల్‌ఫోన్లు, హుక్కా పైపులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని శంషాబాద్‌ రూరల్‌ పోలీసులకు అప్పగించారు.

కాగా నగర శివారు ప్రాంతం కావడంతో శంషాబాద్‌లో ఇటవల అసాంఘిక కార్యకలాపాలు బాగా పెరిగిపోయాయి. మద్యం ఏరులై పారుతోంది. అలాగే హుక్కా, గంజాయిలతో పార్టీలు చేసుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈనేపథ్యంలో పోలీసులు తరచూ దాడులు నిర్వహిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..