Drunk Driving Cases: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాల జప్తుపై హైకోర్టు కీలక ఆదేశాలు..

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాల జప్తుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం సేవించి నడిపితే వాహనం సీజ్..

Drunk Driving Cases: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాల జప్తుపై హైకోర్టు కీలక ఆదేశాలు..
Police

Edited By:

Updated on: Nov 06, 2021 | 1:34 PM

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాల జప్తుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం సేవించి నడిపితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు పేర్కొంది. అలాగే మద్యం సేవించిన వ్యక్తి వాహనం నడిపేందుకు అనుమతించవద్దన్న న్యాయస్థానం.. మద్యం తాగని మరో వ్యక్తి వాహనదారుడి వెంట ఉంటే.. అతడికి వాహనాన్ని అప్పగించాలని తెలిపింది.

ఒకవేళ వాహనదారుడి వెంట ఎవరూ లేకపోతే బంధువు లేదా స్నేహితుడిని పిలిపించి వాహనాన్ని ఇవ్వాలని సూచించింది. ఎవరూ రాకపోతే వాహనం పీఎస్‌కు తరలించి.. తర్వాత అప్పగించాలని తెలిపింది. ఇక ప్రాసిక్యూషన్ అవసరమైన కేసుల్లో 3 రోజుల్లో ఛార్జ్‌షీట్ వేయాలని హైకోర్టు తెలిపింది. ప్రాసిక్యూషన్ పూర్తయ్యాక వాహనాన్ని అప్పగించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలి స్పష్టం చేసింది.

Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు

డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో

ఫోన్‌లో ఆడుతూ రూ.61 వేలకి ఆర్డర్‌ చేసిన చిన్నారి… పెట్టిన ఆర్డర్ చూసి షాక్ అయిన తల్లిదండ్రులు.. వీడియో

ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??