PM Modi on Hyderabad visit: ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Narendra Modi) శనివారం హైదరాబాద్ (Hyderabad) పర్యటనకు రానున్నారు. రంగారెడ్డి ముచ్చింతల్‌లో రామానుజచార్య సహస్రాబ్ధి (Ramanujacharya Sahasrabdi) వేడుకలతో పాటు పటాన్ చెరు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని పాల్గొననున్నారు. కాగా హైదరాబాద్‌లో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోడీ తెలిపారు. ఈమేరకు శనివారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. ‘ఈరోజు హైదరాబాద్‌లో జరిగే రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మధ్యాహ్నం 2:45 గంటలకు వ్యవసాయ, ఆవిష్కరణలకు వేదికైన ICRISAT స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నాను’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు మోడీ.
కాగా మొదట శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధానికి సీఎం స్వాగతం పలుకనున్నారు. ఆయన వెంట హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు, అనంతరం ముచ్చింతల్‌కు చేరుకోనున్నారు. ప్రధాని కార్యక్రమాలన్నింటిలో పాల్గొనడంతో పాటు ఆయన విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వీడ్కోలు పలికే వరకూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ వెంటే ఉంటారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ సీఎం కేసీఆర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటనలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు తోమర్, కిషన్‌రెడ్డి తదితర ప్రముఖులు, నాయకులు పాల్గొననున్నారు. సమతా స్ఫూర్తి కేంద్రంలో ప్రధాని సుమారు మూడు గంటల సేపు పర్యటించనున్నారు.
At 5 PM, I will join the programme to inaugurate the ‘Statue of Equality.’ This is a fitting tribute to Sri Ramanujacharya, whose sacred thoughts and teachings inspire us. https://t.co/i6CyfsvYnw
— Narendra Modi (@narendramodi) February 5, 2022
Sohel’s Mr. Pregnant : సోహైల్ సినిమా సాంగ్ ను లాంచ్ చేసిన క్రేజీ హీరో విశ్వక్ సేన్..
Basara: బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం..