Telangana: పొలిటికల్ హీట్ పెంచుతున్న నేతల కామెంట్స్.. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో అలర్ట్
తెలంగాణలో (Telangana) పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరిగిపోతోంది. బీజేపీ టీఆర్ఎస్ గా రాజకీయ దుమారం నెలకొంది. టీఆర్ఎస్ నేతలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీజేపీ జాయినింగ్స్ కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు....
తెలంగాణలో (Telangana) పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరిగిపోతోంది. బీజేపీ టీఆర్ఎస్ గా రాజకీయ దుమారం నెలకొంది. టీఆర్ఎస్ నేతలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీజేపీ జాయినింగ్స్ కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గమంటున్నారు. బీజేపీ నేతలే తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష ఉద్ధృతం చేశారు. నేతలు టచ్ లో ఉన్నారన్న అధికార, ప్రతిపక్ష లీడర్ల వ్యాఖ్యలతో రాజకీయ పార్టీలు (Political) ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారంతో మరింత అప్రమత్తం అయ్యాయి. కాగా.. తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ఫైర్ అయ్యారు. అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్ నుంచే పోటీ చేస్తానని మరోసారి ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ (CM KCR) ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ‘పల్లె గోస- బీజేపీ భరోసా’ కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఈటల.. ఈ కామెంట్స్ చేశారు. నేతలు పార్టీ మారుతారన్న ఊహాగానాలతో పార్టీ పెద్దలు అప్రమత్తమయ్యారు.
హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో రిపీట్ అవుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ దుర్మార్గాలు, కుట్రలు, అబద్ధాలను నమ్మడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదని ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఈటల రాజేందర్ ఇలాంటి కామెంట్సే చేశారు. ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ ను ప్రగతి భవన్ కు తీసుకొచ్చామన్నారు. తన రాజకీయ జీవితంలో పరుష పదజాలాలు ఏనాడు వాడలేదని, తన గురించి సీఎం కేసీఆర్ దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. ధనవంతులకు రైతుభందు ఎందుకని తాను ప్రశ్నించానని, ఈ విషయాన్ని ఎన్నోసార్లు ముఖ్యమంత్రికి చెప్పినట్లు వెల్లడించారు.