AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wine shop: మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..

ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మద్యం దుకాణాలు మూసివేయిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజగా శ్రీరామనవమిని పురస్కరించుకొని హైదరాబాద్‌ జంట నగరాల్లో ఒకరోజు మద్యం దుకాణాలు బంద్‌ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీ (బుధవారం) మద్యం దుకాణాలు బంద్‌ కావాల్సిందే అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు...

Wine shop: మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
Wines Close
Narender Vaitla
|

Updated on: Apr 16, 2024 | 8:44 AM

Share

సాధారణంగా మద్యం దుకాణాలకు ప్రత్యేకంగా సెలవులు అనేవి ఏం ఉండవు. ఆదివారం, సోమవారం అనే తేడా లేకుండా మందు బాబులు మద్యాన్ని సేవిస్తుంటారు. అందుకే వారికి అందుబాటులో ప్రతీ రోజూ మద్యం దుకాణాలు తెరిచే ఉంటాయి. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం మద్యం దుకాణాలను అధికారులు మూసి వేస్తుంటారు.

ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మద్యం దుకాణాలు మూసివేయిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజగా శ్రీరామనవమిని పురస్కరించుకొని హైదరాబాద్‌ జంట నగరాల్లో ఒకరోజు మద్యం దుకాణాలు బంద్‌ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీ (బుధవారం) మద్యం దుకాణాలు బంద్‌ కావాల్సిందే అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైనా మద్యం దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఏప్రిల్ 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న వైన్స్‌, కల్లు కాంపౌండ్లు, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు అన్నీ మూతపడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే సమ్మర్‌ నేపథ్యంలో మందుబాబులు బీర్లను తెగ లాగించేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో బీర్ల అమ్మకాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. వేడి వేడి వాతావరణంలో చల్లచల్లని బీర్లను లాగించేందుకు తెగ ఆరాటపడుతున్నారు. అందుకు అనుగుణంగానే బీర్‌ స్టాక్ ఖాళీ అయ్యింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బ్రాండెడ్ బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది. రేషన్ ఆధారంగా ప్రధాన బ్రాండ్ల బీర్లను ఒక్కో షాపునకు 20-25 కేస్ లు ఇస్తుండగా…ఇవి సరిపోవడంలేదని మద్యం షాపుల యజమానులు అంటున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..