AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భర్త ఆశపడ్డాడు.. భార్య బ్యూటీపార్లర్‌‌కు వెళ్లింది.. కట్‌చేస్తే, ఉన్న జుట్టు మొత్తం చేతిలో పట్టుకుని..

Hyderabad News: ఆమె చేసిన తప్పు ఏంటంటే.. తన భర్త కోరిక తీర్చాలన్న ఉద్దేశంతో ఆ మహిళ ఓ బ్యూటీపార్లర్‌‌కు వెళ్లింది.. జట్టు బాగా పొడవు కావాలని చెప్పింది. దీంతో వారు ఏదో ఆయిల్‌ను ఇచ్చారు. ఆ నూనెను తలకు పట్టించిన నాటినుంచి ఆమెకు మరో సమస్య మొదలైంది.. జుట్టు పొడవుగా పెరగడం ఏమో కానీ.. ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లోని పాత బస్తీలో చోటుచేసుకుంది.

Hyderabad: భర్త ఆశపడ్డాడు.. భార్య బ్యూటీపార్లర్‌‌కు వెళ్లింది.. కట్‌చేస్తే, ఉన్న జుట్టు మొత్తం చేతిలో పట్టుకుని..
Hyderabad News
Shaik Madar Saheb
|

Updated on: Aug 03, 2023 | 7:11 AM

Share

హైదరాబాద్, ఆగస్టు 3: ఇది అత్యాశానా? లేక అవకాశం ఉందని ప్రయత్నించిందా..? కారణాలేవైనా.. ఆ మహిళ ఏదో చేయబోతే మరేదో అయింది.. తీరా.. ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయి లబోదిబోమంటోంది. ఆమె చేసిన తప్పు ఏంటంటే.. తన భర్త కోరిక తీర్చాలన్న ఉద్దేశంతో ఆ మహిళ ఓ బ్యూటీపార్లర్‌‌కు వెళ్లింది.. జట్టు బాగా పొడవు కావాలని చెప్పింది. దీంతో వారు ఏదో ఆయిల్‌ను ఇచ్చారు. ఆ నూనెను తలకు పట్టించిన నాటినుంచి ఆమెకు మరో సమస్య మొదలైంది.. జుట్టు పొడవుగా పెరగడం ఏమో కానీ.. ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లోని పాత బస్తీలో చోటుచేసుకుంది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ సిటీకి చెందిన ఓ మహిళ అబిడ్స్‌లో బ్యూటీ పార్లర్‌కి వెళ్లింది. తనను మోడల్‌గా చూడాలనుకుంటున్న భర్త కోరికను తీర్చడమే తన ప్రయత్నమని.. ఎలాగైనా తన సమస్యకు దారి చూపాలంటూ వారికి చెప్పింది. దీంతో వారు ఏవేవో సూచనలు చేశారు. బ్యూటిషియన్ చెప్పినట్లు పొడుగ్గా ఉన్న హెయిర్‌ని కట్ చేయించుకుంది. ఆ తర్వాత బ్యూటీషియన్ హెయిర్ ఆయిల్ పెట్టింది. అంతా బాగానే ఉందనుకుని సంతోషంలో ఉండగానే.. మరో సమస్య ఆమెను వెంటాడింది.

బ్యూటీషియన్ చెప్పినట్లు జట్టు కోసం చికిత్స తీసుకుంటే.. ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయింది. నూనెతో మర్దన చేయగానే.. ఉన్న జుట్టు మొత్తం ఊడి రావడంతో కంగుతిన్న బాధితురాలు ఇంటికి పరుగులు తీసింది. భార్య హెయిర్ ఊడిపోవడం చూసి భర్త షాక్‌కి గురయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఊడిపోతున్న వెంట్రుకలని పట్టుకుని బాధితురాలు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బ్యూటీ పార్లర్‌పై దాడి చేసి నిర్వాహకులని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. బ్యూటీ పార్లర్ నిర్వాహకులు పారిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు