Hyderabad: బెస్ట్ ఎన్‌జీవోగా రిలయన్స్ ఫౌండేషన్‌.. అట్టహాసంగా హైబిజ్ టీవీ బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం..

Business Excellence Awards: ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్‌కు ఉత్తమ NGO అవార్డు లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాతృత్వ విభాగాన్నీ లీడ్ చేస్తోన్న నీతా అంబానీ.. దేశంలో పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్, వినూత్న, స్థిరమైన పరిష్కారాల ద్వారా భారతదేశ అభివృద్ధి సవాళ్లలో కీలక పాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం అంతటా 54,300 గ్రామాలలో 70 మిలియన్లకుపైగా ప్రజలకు అండగా నిలిచింది.

Hyderabad: బెస్ట్ ఎన్‌జీవోగా రిలయన్స్ ఫౌండేషన్‌.. అట్టహాసంగా హైబిజ్ టీవీ బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం..
Hybiz TV Business Excellence Awards

Edited By:

Updated on: Sep 13, 2023 | 9:57 PM

హైదరాబాద్: ‘జై జవాన్, జై కిసాన్, జై వ్యాపారి’ అనే ట్యాగ్‌లైన్ ఆధారంగా హైబిజ్ టీవీ తొలిసారిగా నిర్వహించిన బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవానికి విశేష స్పందన లభించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ  కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్‌కు ఉత్తమ NGO అవార్డు లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాతృత్వ విభాగాన్నీ లీడ్ చేస్తోన్న నీతా అంబానీ.. దేశంలో పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్, వినూత్న, స్థిరమైన పరిష్కారాల ద్వారా భారతదేశ అభివృద్ధి సవాళ్లలో ఉత్ప్రేరక పాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం అంతటా 54,300 గ్రామాలలో 70 మిలియన్లకుపైగా ప్రజలకు అండగా నిలిచింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యాపారం సంపదను సృష్టించడమే కాకుండా సమాజాభివృద్ధికి దోహదపడాలన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఎదుర్కోని ముందుకు సాగాలని’ సూచించారు.

HICC నోవాటెల్‌లో జరిగిన ఈ అవార్డు ఫంక్షన్‌లో M/s EQIC Dies & Molds Engineers Pvt Ltd బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డును అందుకుంది. ఈ అవార్డును M/s EQIC డైస్ & మోల్డ్స్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు పి. కృష్ణ & టి. రాజేంద్ర ప్రసాద్ అందుకున్నారు. ఈ అవార్డును TSIIC హైదరాబాద్ శాఖ వైస్ ఛైర్మన్, ఎండీ, ఐఏఎస్ ఈవీ నరసింహ రెడ్డి, TSIIC హైదరాబాద్ శాఖ ప్రెసిడెంట్ సి. శేఖర్ అందజేశారు.  అలాగే కోకా సత్యనారాయణ గారికి లెజెండ్రీ అవార్డు దక్కింది. ఆయన అతిథుల చేత ఈ అవార్డు అందుకున్నారు. తన ఈ జర్నీలో సహాయ సహకారాలు అందించిన.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలిగ్స్ ఇలా అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

 

హైబిజ్ టీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం

హైదరాబాద్‌కు చెందిన M/s Eqic Dies & Molds Engineers Pvt Ltd, గత 28 ఏళ్లుగా అధిక ఖచ్చితత్వం, అధిక నాణ్యత, స్థిరమైన, ఉత్పాదక సాధనాల తయారీ, సరఫరాలో అగ్రగామిగా నిలిచింది. ఈ సంస్థం ముఖ్యంగా జిగ్స్, ఫిక్స్చర్స్, గేజ్‌లు, ప్రెస్ టూల్స్, ప్రెసిషన్ ఏరోస్పేస్, పవర్, ఆటోమొబైల్ మొదలైన వివిధ రకాల అప్లికేషన్‌లను తయరీతోపాటు, సరఫరాలోనూ సత్తాచాటుతోంది.

కాగా, మీడియా అవార్డ్స్, ఉమెన్ లీడర్‌షిప్ అవార్డ్స్, ఫుడ్ అవార్డ్స్, హెల్త్‌కేర్ అవార్డ్స్, టీ మేకింగ్, ది గ్రేట్ ఇండియా ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్‌లలో అనేక సంవత్సరాల పాటు విజయవంతమైన ఈవెంట్‌లు నిర్వహించిన Hybiz.TV.. తాజాగా అసాధారణ వ్యాపార వ్యక్తులను గుర్తించి, ప్రోత్సహించేందుకు ఒక ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభించిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ క్రమంలో బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డులు 2023 పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..