AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చూడ్డానికి ఎంత అమాయకంగా ఉన్నాడో.. పెళ్లి అయ్యాక అందర్నీ వదిలేసి మెట్టినింటికి వచ్చిన ఆమెను..

కొత్త జీవితం మొదలై రెండు నెలలే అయింది.. ఇంతలోనే భర్త వేధింపులు మొదలయ్యాయి.. అటు భర్త వేధింపులు తట్టుకోలేకపోయింది.. ఇటు పుట్టింటికి ఏం చేప్పాలో అర్ధం కాలేదు.. దీంతో ఆమె జీవితం ఉక్కిరిబిక్కిరైంది.. పెళ్లైన రెండు నెలలకే భర్త టార్చర్ తో జీవితం మీద విరక్తి ఏర్పడింది.. మనస్థాపంతో కుమిలిపోయింది..

చూడ్డానికి ఎంత అమాయకంగా ఉన్నాడో.. పెళ్లి అయ్యాక అందర్నీ వదిలేసి మెట్టినింటికి వచ్చిన ఆమెను..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jun 23, 2025 | 12:46 PM

Share

కొత్త జీవితం మొదలై రెండు నెలలే అయింది.. ఇంతలోనే భర్త వేధింపులు మొదలయ్యాయి.. అటు భర్త వేధింపులు తట్టుకోలేకపోయింది.. ఇటు పుట్టింటికి ఏం చేప్పాలో అర్ధం కాలేదు.. దీంతో ఆమె జీవితం ఉక్కిరిబిక్కిరైంది.. పెళ్లైన రెండు నెలలకే భర్త టార్చర్ తో జీవితం మీద విరక్తి ఏర్పడింది.. మనస్థాపంతో కుమిలిపోయింది.. చివరకు ప్రాణాలు తీసుకునేలా దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది.. భర్త వేధింపులతో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులో చోటుచేసుకుంది.

కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు (కె.పి.హెచ్.బి) కాలనీలోని ఓ బంగారు నగర దుకాణంలో సేల్స్ మాన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ కు ఖమ్మం జిల్లాకు చెందిన పూజితకి ఏప్రిల్ 16న వివాహం జరిగింది. కొన్ని రోజుల వరకు బాగానే ఉన్న శ్రీనివాస్.. అనంతరం తన వక్రబుద్ధిని బయటపెట్టాడు.. అదనపు కట్నం తీసుకురావాలని పూజితను వేధించడం మొదలుపెట్టాడు.. అంతేకాకుండా తన బంధువులతో కొన్నాళ్ల క్రితం పూజిత కూల్ డ్రింక్ తాగిన వీడియో చూపిస్తూ శ్రీనివాస్ నిత్యం వేధించేవాడు.. భర్త వేధింపులు తీవ్రమవ్వడంతో నవవధువు పూజిత ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

పెళ్లైన రెండు నెలలకే పూజిత తన ప్రాణాలను తీసుకోవడం అందరినీ కలచివేస్తోంది. పూజిత బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పూజిత భర్త శ్రీనివాస్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు మొత్తం ఏడుగురు ఆమెను మానసికంగా వేధించారని ఆరోపించారు. పెళ్లికి 11 లక్షలు ఖర్చు చేయడంతోపాటు కట్నకానుకలు ఇచ్చామని.. ఆ తర్వాత 10 లక్షలు కావాలని అత్తింటి వారితోపాటు భర్త వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంట చేతికొచ్చిన తర్వాత ఇస్తామని హామీఇచ్చినప్పటికీ.. వేధించారని పేర్కొన్నారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. భర్త శ్రీనివాస్ తోపాటు ఆరుగురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..