గుడ్లు Vs మీల్ మేకర్.. ఎందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది..? ఆరోగ్యానికి ఏంది బెస్ట్..!
కండరాల బలానికి, బరువు తగ్గడానికి లేదా ఫిట్‌గా మారడానికి ప్రతి ఒక్కరూ వెతికేది ఒకటే.. ప్రోటీన్. అయితే ప్రోటీన్ రేసులో ఎల్లప్పుడూ గుడ్లు, సోయా చంక్స్ మధ్య పెద్ద పోరాటమే నడుస్తుంది. నాన్ వెజ్ తినేవారికి గుడ్డు నంబర్ వన్ ఛాయిస్ అయితే.. శాకాహారులకు సోయా చంక్స్ ఒక పెద్ద నిధి. మరి ఈ రెండింటిలో ప్రోటీన్ క్వాలిటీ పరంగా అసలైన కింగ్ ఎవరు? అనేది తెలుసుకుందాం..

మన శరీరానికి ప్రోటీన్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కండరాల బలం కోసం, బరువు తగ్గడానికి లేదా ఫిట్‌గా ఉండటానికి ప్రతి ఒక్కరూ తమ డైట్‌లో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటారు. అయితే ప్రోటీన్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి గుడ్లు, మీల్ మేకర్. లా మంది వీటిలో ఏది బెస్ట్ అనే గందరగోళంలో ఉంటారు. జంతు ఆధారిత ప్రోటీన్‌కు గుడ్లు కేరాఫ్ అడ్రస్ అయితే.. మొక్కల ఆధారిత ప్రోటీన్‌కు సోయా చంక్స్ రారాజు. మరి ఈ రెండింటిలో మీ శరీరానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది? అనేది తెలుసుకుందాం..
ప్రోటీన్ క్వాలిటీలో గుడ్డు నంబర్ వన్ ఎందుకు..?
ప్రోటీన్ నాణ్యత, అది శరీరానికి అబ్బే విషయంలో గుడ్లు ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ హెల్త్ జర్నల్ హెల్త్‌లైన్ ప్రకారం.. డరాల మరమ్మత్తుకు, శరీర ఎదుగుదలకు అవసరమైన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు గుడ్డులో పుష్కలంగా ఉన్నాయి. క గుడ్డులో సుమారు 6 నుండి 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీని బయోఅవైలబిలిటీ చాలా ఎక్కువ. అంటే మనం తిన్న గుడ్డులోని ప్రోటీన్‌ను మన శరీరం చాలా సులభంగా, వేగంగా గ్రహించి ఉపయోగించుకోగలదు. జీర్ణశక్తి పరంగా కూడా గుడ్లు చాలా శ్రేష్ఠమైనవి.
సోయా చంక్స్..ప్రోటీన్ నిధి
మరోవైపు శాకాహారులకు సోయా చంక్స్ ఒక వరప్రసాదం లాంటివని చెప్పాలి. అత్యంత తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ పొందడానికి ఇదొక్కటే మార్గం. కేవలం 50 గ్రాముల సోయా చంక్స్‌లో సుమారుగా 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంటే గుడ్లతో పోలిస్తే పరిమాణంలో ప్రోటీన్ శాతం ఇందులో చాలా ఎక్కువ. గుడ్లలో లేని ఫైబర్ సోయా చంక్స్‌లో పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. సోయాలో కూడా అన్ని అమైనో ఆమ్లాలు ఉన్నప్పటికీ.. జంతు ప్రోటీన్‌తో పోలిస్తే మొక్కల ఆధారిత ప్రోటీన్ శోషణ రేటు శరీరంలో కొద్దిగా తక్కువగా ఉంటుంది.
వెబ్‌ఎమ్‌డి మీ బాడీకి ఏది సెట్ అవుతుంది?
మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను బట్టి మీరు దేన్ని ఎంచుకోవాలో ప్రముఖ హెల్త్ వెబ్‌సైట్ WebMD స్పష్టం చేసింది. మీరు జిమ్‌కు వెళ్తూ, కండరాలు పెంచడంపైనే పూర్తి ఫోకస్ పెడితే.. గుడ్లు మీకు అత్యంత వేగవంతమైన, సంపూర్ణమైన ప్రోటీన్ మూలం. మీరు కఠినమైన శాకాహారి అయినా లేదా తక్కువ బడ్జెట్‌లో డైట్ ప్లాన్ చేయాలన్నా సోయా చంక్స్ అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఇవి ప్రోటీన్‌ను అందించడమే కాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని, బరువు నియంత్రణలో సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
ఆరోగ్య నిపుణుల స్మార్ట్ టిప్
సోయా చంక్స్‌లోని ప్రోటీన్ స్థాయిలను శరీరం పూర్తిగా గ్రహించాలంటే.. వాటిని ఒంటరిగా కాకుండా అన్నం లేదా బ్రెడ్ వంటి ధాన్యాలతో కలిపి తీసుకోవడం వల్ల వాటి పోషక విలువలు మరింత పెరుగుతాయి.
