MMTS Services: జంటనగరాలలోని ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్ల ప్రయాణికులకు శుభవార్త. ఇకపై హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాల్లోని ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఎమ్‌ఎమ్‌టీఎస్ సేవలను మరింతగా పెంచింది. హైదరాబాద్-సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలకు వెళ్లే ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్ల సంఖ్యను పెంచడంతో పాటు, వాటి గమ్యస్థానాన్ని కూడా పొడిగించింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు వెళ్లేందుకు 20 ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను అదనంగా కేటాయించింది దక్షిణ మధ్య రైల్వే. అలాగే లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ మీదుగా ఫలక్‌నూమా వెళ్లే ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను ఉందానగర్ వరకు పొడిగించింది. దీంతో జంటనగరాలలో నడిచే ఎమ్ఎమ్‌టీఎస్ రైళ్ల సంఖ్య 106కు చేరింది.
జంట నగరాల నుంచి మేడ్చల్‌కు రాకపోకలు జరుపుతున్న ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో.. దక్షిణ మధ్య రైళ్లే ఆ మార్గంలో 20 ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను అదనంగా కేటాయింది. ఈ క్రమంలోనే 47231, 47222, 47233, 47224, 47235, 47226, 47237, 47228, 47239, 47230 నంబర్లు కలిగిన 10 ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను మేడ్చల్ నుంచి సికింద్రాబాద్‌కి వచ్చేందుకు కేటాయించగా.. 47221, 47232, 47223, 47234, 47225, 47236, 47227, 47238, 47229, 47240 నంబర్లు కలిగిన మరో 10 ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లేందుకు అదనంగా జోడించడం జరిగింది.
జంటనగరాల విస్తీర్ణం, అలాగే ఇక్కడను నిత్యం రాకపోకలు జరిపేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. లింగంపల్లి-ఫలక్‌నూమా మార్గంలో నడిచే రైళ్లను ఉందానగర్ వరకు పొడిగించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ క్రమంలోనే 47213, 47173, 47176, 47178, 47212, 47181, 47210, 47190, 47159, 47194 నంబర్లు కలిగిన ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను లింగంపల్లి నుంచి సికింద్రాబాద్, ఫలక్‌నూమా ప్రాంతాల మీదుగా ఉందానగర్ వరకు పొడిగించింది. అలాగే 47151, 47153, 47154, 47211, 47165, 47157, 47214, 47160, 47164, 47203 నంబర్ల ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను ఫలక్‌నూమా నుంచి కాకుండా ఉందానగర్ నుంచి లింగంపల్లికి వచ్చేలా ఏర్పాట్లు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.