Hyderabad: నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. గంజాయి అక్రమ రవాణాదారునికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు..

Hyderabad: నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. గంజాయి అక్రమ రవాణాదారునికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు..
Ganja

Hyderabad: గంజాయి కేసు విషయంలో హైదరాబాద్‌ లోని నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అక్రమంగా గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన ఒక వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధించింది

Basha Shek

|

Apr 12, 2022 | 9:07 PM

Hyderabad: గంజాయి కేసు విషయంలో హైదరాబాద్‌ లోని నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అక్రమంగా గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన ఒక వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధించింది. రెండేళ్ల క్రితం 1,427 కిలోల గంజాయి అక్రమ రవాణా చేస్తూ పంతంగి టోల్ ప్లాజా వద్ద డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డాడు నదీమ్. ఈ గంజాయి విలువ రూ.3.56 కోట్లకు పైగానే ఉంటుందని సీజ్‌ చేసిన అధికారులు అప్పట్లో చెప్పుకొచ్చారు. తూర్పు గోదావరి నుంచి ఉత్తరప్రదేశ్‌కు భారీ ట్రక్కులో గంజాయిని తరలిస్తుండగా డీఆర్‌ఐ హైదరాబాద్‌ విభాగం అధికారులకు సమాచారం అందింది. దీంతో పంతంగి టోల్‌గేట్‌ వద్ద మాటు వేసి నదీమ్‌ను పట్టుకున్నారు. ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు నేడు తుది తీర్పు ప్రకటించింది. ఈ సందర్భంగా గంజాయి సప్లయ్‌దారుకు రూ. 20 ఏళ్ల జైలుతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.

కాగా గంజాయితో పాటు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పోలీసులు కూడా తరచూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే గంజాయి సప్లయ్ దారుకు కఠినశిక్షతో పాటు జరిమానా విధించింది నాంపల్లి న్యాయస్థానం.  కాగా డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడిన ఉద్యోగులు, సిబ్బందిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి ఆయా సంస్థలు, కంపెనీలు.  ఈక్రమంలోనే డ్రగ్స్ తీసుకొంటున్నారని పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు 13 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను ఆయా సంస్థలు ఉద్యోగాల నుంచి తొలగించాయి. మరో 50 మందికి  కూడా  నోటీసులు ఇచ్చారు. కాగా  సాప్ట్‌వేర్ ఇంజనీర్లకు డ్రగ్స్ ఎలా అందుతున్నాయనే విషయాలపై   పోలీసులు ఆరా తీస్తున్నారు.  పబ్ లలో జరిగే  వీకెండ్ పార్టీలతో పాటు నగర శివార్లలోని ఫామ్ హౌజ్‌లలో నిర్వహించే రేవ్  పార్టీలపై కూడా పోలీసులు నిఘాను ఏర్పాటు చేశారు.

Also Read: CM KCR Press Meet: పీయూష్ గోయల్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం.. సంచలన ప్రెస్‌మీట్.. LIVE

CM KCR Press Meet: పీయూష్ గోయల్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం.. సంచలన ప్రెస్‌మీట్.. LIVE

Bihar CM Nitish Kumar: బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ సభలో బాంబు పేలుడు.. తృటిలో తప్పిన ప్రమాదం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu