Multibagger stock: స్టాక్ రేట్ తక్కువే కానీ ఇచ్చిన రాబడి ఎక్కువ.. ఇంతకీ ఆ షేర్ ఏమిటంటే..
Multibagger stock: పెన్సీ స్టాక్స్‌లో(Penny stock) ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడూ రిస్క్ తో కూడుకున్న విషయమే. ఎందుకుంటే మార్కెట్‌లో కాస్త ఊగిసలాట కనిపించినా.. ఈ స్టాక్స్‌లో ఒలటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.
Multibagger stock: పెన్ని స్టాక్స్‌లో(Penny stock) ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడూ రిస్క్ తో కూడుకున్న విషయమే. ఎందుకుంటే మార్కెట్‌లో కాస్త ఊగిసలాట కనిపించినా.. ఈ స్టాక్స్‌లో ఒలటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అమాంతం కుప్పకూలి ఇన్వెస్టర్లకు నష్టాలను కలిగిస్తుంటాయి. కానీ.. మార్కెట్ ను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. కొంచెం కంపెనీ ఫండమెంటల్స్ గురించి తెలుసుకుని పెట్టబడి పెట్టవారికి మాత్రం ఊహించని లాభాలు సొంతమవుతాయి. కొన్ని పెన్ని స్టాక్స్ స్వల్పకాలంలోనే మంచి రాబడులను అందిస్తుంటాయి. సామాన్య ప్రజలను కూడా లక్షాధికారులను, ఒక్కోసారి కోటీశ్వరులనూ కూడా చేస్తుంటాయి. ఈ కోవకు చెందిన స్టాక్ సింధూ ట్రేడ్ లింక్స్ (Sindhu Trade Links). తాజాగా 11-04-2022 న కంపెనీ బోర్టు ప్రతి రెండు షేర్లకు ఒక షేర్ చొప్పున బోనస్ షేర్లు అందించాలని నిర్ణయించింది.
సింధు ట్రేడ్ లింక్స్ కంపెనీ రవాణా, లాజిస్టిక్స్ వ్యాపారాలు నిర్వహిస్తోంది. రూ. 1.69 నుంచి ఏకంగా రూ. 136 స్థాయికి స్టాక్ ధర పెరిగింది. ఈ కాలంలో ఇన్వెస్టర్లకు దాదాపు 7000 శాతం రాబడిని స్టాక్ అందించింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ గత నెలలో ఒక రేటు మధ్యలో కన్సాలిడేట్ అయింది. ఈ కంపెనీ స్టాక్ గత నెలలో దాదాపు 9 శాతం క్షీణించి రూ.136 నుంచి రూ.128కి చేరుకుంది. ఇటీవలి కాలంలో స్టాక్ ప్రయాణాన్ని పరిశీలిస్తే.. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ కేవలం మూడు నెలల కాలంలోనే 73 నుంచి 128 స్థాయికి పెరిగింది. ఈ కాలంలో స్టాక్ 69 శాతం వృద్ధిని నమోదు చేసింది.
గత ఆరు నెలల్లో ఈ స్టాక్ రూ.37.40 నుంచి 119.25 స్థాయికి పెరిగింది. ఈ స్వల్ప వ్యవధిలో దాదాపు 220 శాతానికి పైగా రాబడిని అందించింది. ఈ సమయంలో అది రూ.162 గరిష్ఠ స్థాయిని కూడా తాకింది. ఇక గత ఏడాది కాల వ్యవధిలో స్టాక్ 5.72 స్థాయి నుంచి 119.25 స్థాయిలకు పెరిగింది. ఇది దాదాపు 1985 శాతం పెరుగుదల. గత 5 సంవత్సరాల ప్రయాణాన్ని పరిశీలిస్తే.. ఫిబ్రవరి 17, 2017న BSEలో ఈ స్టాక్ రూ.1.69 వద్ద ముగిసింది. ఈ 5 సంవత్సరాల్లో స్టాక్ దాదాపు 7000 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. ఇన్వెస్టర్ 6 నెలల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ. లక్ష రెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ. 3.20 లక్షలు అయ్యేది. ఎవరైనా సంవత్సరం క్రితం ఈ స్టాక్‌లో రూ. లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే.. ఇప్పుడది రూ. 20.85 లక్షలకు పెరిగేది. ఎవరైనా ఐదేళ్ల క్రితం లక్ష ఇన్వెస్ట్ చేస్తే.. దాని విలువ ప్రస్తుతం 71 లక్షలకు చేరేది. సింధు ట్రేడ్ లింక్స్ స్టాక్ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,130 కోట్లుగా ఉంది.
NOTE: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
ఇవీ చదవండి..