Crypto Investment: మీరు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ 7 విషయాలను తప్పక గుర్తుంచుకోండి..

Crypto Investment: క్రిప్టోకరెన్సీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రిప్టో ప్రపంచంలోని అనేక దేశాల్లో అంగీకరించబడుతోంది. అయితే.. భారతదేశంతో సహా చాలా దేశాల్లో, దీనికి సంబంధించి ఎటువంటి నియమాలు, నిబంధనలు ప్రత్యేకంగా లేవు.

Crypto Investment: మీరు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ 7 విషయాలను తప్పక గుర్తుంచుకోండి..
Crypto Trading
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 12, 2022 | 6:21 PM

Crypto Investment: క్రిప్టోకరెన్సీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రిప్టో ప్రపంచంలోని అనేక దేశాల్లో అంగీకరిస్తున్నారు. అయితే.. భారతదేశంతో సహా చాలా దేశాల్లో, దీనికి సంబంధించి ఎటువంటి నియమాలు, నిబంధనలు ప్రత్యేకంగా లేవు. చాలా దేశాల్లో ప్రభుత్వాలు దీనిని అధికారికంగా గుర్తించలేదు. అయినప్పటికీ క్రిప్టో కరెన్సీలో(crypto currencies) పెట్టుబడులు పెట్టడంలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. మీరు కూడా క్రిప్టోలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఈ విషయాలను గుర్తుంచుకోండి. సరైన రీసెర్చ్(Research) చేయకుండా క్రిప్టోలో పెట్టుబడి పెట్టవద్దు. క్రిప్టో అంటే డిజిటల్ కరెన్సీకి సంబంధించి మీ స్థాయిలో పూర్తి పరిశోధన చేయండి. ఇతరుల మాట విని పెట్టుబడి పెట్టవద్దు. మీరు ఈ అసెట్ క్లాస్‌ని బాగా అర్థం చేసుకోనట్లయితే.. ఇందులో పెట్టుబడి పెట్టడాన్ని తప్పు పట్టకండి.

  1. విశ్వసనీయ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఈ రోజు మార్కెట్లో డజన్ల కొద్దీ ప్లాట్‌ఫారమ్‌లు క్రిప్టోలో పెట్టుబడి పెట్టే సౌకర్యాన్ని అదిస్తున్నాయి. మీరు మార్కెట్‌పై విశ్వసనీయత, నమ్మకాన్ని పెంచుకున్న ప్రసిద్ధ ప్లాట్‌ఫారమ్ ద్వారా మాత్రమే పెట్టుబడి పెట్టండి.
  2. సరైన క్రిప్టోను కనుగొనండి. వాటిలో మాత్రమే డబ్బు పెట్టుబడిపెట్టండి. క్రిప్టో మార్కెట్‌లో బిట్‌కాయిన్, ఈథర్, డాడ్జ్‌కాయిన్ వంటి అనేక రకాల డిజిటల్ లేదా క్రిప్టో కరెన్సీలు అందుబాటులో ఉన్నాయి. మీకు పూర్తి అవగాహన ఉన్న లేదా మార్కెట్‌లో విశ్వసనీయతను కలిగి ఉన్న డిజిటల్ కరెన్సీలో మాత్రమే పెట్టుబడి పెట్టండి. తక్కువ రేటుకు వస్తున్నాయని ఏదో ఒక క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టవద్దు.
  3. చిన్న పెట్టుబడులతో ప్రారంభించండి. మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బును ఒక్కసారిగా పెట్టుబడి పెట్టకండి. ఎల్లప్పుడూ చిన్న మొత్తంతో క్రిప్టోల్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. ప్రస్తుతం మీ పోర్ట్‌ఫోలియోలో ఈ అసెట్‌కు ఎక్కువ భాగం ఇవ్వవద్దని ఇన్వెస్ట్‌మెంట్ సలహాదారులు చెబుతున్నారు. మొత్తం పెట్టుబడిలో 5 నుంచి 7 శాతం మాత్రమే క్రిప్టోలో పెట్టుబడి పెట్టండి. మిగిలిన డబ్బును ఇతర ఇన్వెస్ట్ మెంట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టండి.
  4. క్రిప్టో కరెన్సీలు రిస్కీ, హై ఒలటాలిటీ కలిగినవి. రాత్రికి రాత్రి ధనవంతులు కావడానికి క్రిప్టోల ఎంపిక చాలా ప్రమాదకరం. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు పెట్టుబడిదారు రిస్క్‌కి సిద్ధంగా ఉండాలి. మీరు రిస్క్ భరించగలిగినంత మాత్రమే వాటిలో పెట్టుబడి పెట్టండి.
  5. దీర్ఘకాలిక క్రిప్టోలో పెట్టుబడి పెట్టవద్దు. క్రిప్టో ఇంకా నియంత్రిత ఆస్తి కాదు. కాబట్టి ఎక్కువ కాలం పాటు దానిలో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదు. అయితే.. చాలా త్వరగా కొనడం, అమ్మటం కూడా సరైన పద్ధతి కాదు. పెట్టుబడి సమయంలోనే కొంత లాభాన్ని టార్గెట్ పెట్టుకుని ఆ తరువాత వాటిని అమ్మేయటం ఉత్తమం.
  6. దురాశలో పడకండి. ఇంటర్నెట్ పుకార్లకు దూరంగా ఉండండి, వేరొకరు ఏదైనా క్రిప్టో కరెన్సీ నుంచి లాభం పొందారని చూసి మీరు పెట్టుబడి పెట్టాలని అనుకోవద్దు. వాస్తవాల ఆధారంగా పెట్టుబడి పెట్టండి. విశ్వసనీయ నిపుణుల నుండి సలహా పొందండి.
  7. క్రిప్టో నుంచి ఆదాయాలపై పన్ను బాధ్యతను దాచవద్దు. క్రిప్టో నుంచి వచ్చే ఆదాయాలపై భారత ప్రభుత్వం పన్ను విధిస్తోంది. మీరు లాభాన్ని ఆర్జించినట్లయితే.. మీరు మీ పన్ను బాధ్యతను దాచకూడదు. పన్ను అధికారుల దృష్టిలో మిమ్మల్ని నేరస్థుడిగా మార్చే ఎలాంటి చర్యలకు పాల్పడకూడదు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Knowledge: నగరాల పేర్లు మార్చడం ఎప్పుడు మొదలైంది.. దీనికి కారణాలు ఏంటి..?

Pawan Kalyan: అనంతపురం జిల్లాలో కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..