Watch Video: దారుణం.. ప్రియుడితో కలిసి ఐదేళ్ల చిన్నారిని చితకబాదిన కన్న తల్లి!

కన్నతల్లి, సవతి తండ్రితో కలిసి.. కన్న కుతురిని వేదింపులకు గురి చేసింది. స్థానికుల పిర్యాదుతో ఇద్దరిని రిమాండ్ తరలించిన పోలీసులు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ హాఫీజ్‌పేట్ ప్రాంతంలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల ఒకటో తేదీన చిన్నారి ఒంటిపై..

Watch Video: దారుణం.. ప్రియుడితో కలిసి ఐదేళ్ల చిన్నారిని చితకబాదిన కన్న తల్లి!
Mother Attacked On Her Won Daughter

Updated on: Oct 06, 2025 | 12:44 PM

హైదరాబాద్‌, అక్టోబర్ 6: మియాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కన్న కుతురిని వేదింపులకు గురి చేసిన కన్నతల్లి, సవతి తండ్రి. స్థానికుల పిర్యాదుతో ఇద్దరిని రిమాండ్ తరలించిన పోలీసులు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ హాఫీజ్‌పేట్ ప్రాంతంలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల ఒకటో తేదీన చిన్నారి ఒంటిపై గాయాలను గమనించిన స్థానికులు.. ఆ గాయాల గురించి వారు చిన్నారిని ఆరా తీశారు. దీంతో సవతి తండ్రితో కలిసి తన తల్లి ప్రతిరోజు కొడుతోందని, వేధింపులకు గురిచేస్తున్నట్లు చిన్నారి తెలిపింది.

చిన్నారి ఒంటి పై గాయాలతో తీవ్రంగా స్పందించిన స్థానికులు.. మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ అనంతరం చిన్నారి కన్నతల్లి షబానా నాజ్విన్, సవతి తండ్రి జావేద్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చిన్నారిని మొదటగా పోలీసులు వసతి గృహానికి తరలించగా.. రెండు రోజుల తర్వాత చిన్నారి కన్నతండ్రి, బాబాయ్ వచ్చి ఇంటికి తిసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.